E-Paper
Advertisement

Netflix OTT : ‘ఇక్కా’ నుండి ‘ఫ్యామిలీ బిజినెస్’ వరకు…. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ను షేక్ చేయనున్న సినిమాలు, సిరీస్లు ఇవే

Netflix OTT : ‘ఇక్కా’ నుండి ‘ఫ్యామిలీ బిజినెస్’ వరకు…. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ను షేక్ చేయనున్న సినిమాలు, సిరీస్లు ఇవే
Advertisement

Netflix OTT  : సినిమా, సిరీస్ లకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ ఫామ్‌ ఎక్కువగా వినిపించే పేరు. ఇది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి 10 సంవత్సరాలు అయింది. ప్రస్తుతం దాని 10వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఈ ప్లాట్‌ ఫామ్‌ వేదికగా ప్రకటించారు. ఇవి ఈ ఏడాది విడుదలవుతాయి. కామెడీ, హిస్టారికల్, బయోపిక్, లీగల్ థ్రిల్లర్ మిక్స్‌తో అదిరిపోయే కంటెంట్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

1. Ikka

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. ‘బోర్డర్’ సినిమా తర్వాత వీరిద్దరూ దాదాపు 30 ఏళ్లకు మళ్ళీ కలిసి నటిస్తుండటం విశేషం. ఒక నిజాయితీ గల సీనియర్ లాయర్ (సన్నీ డియోల్), తను గతంలో కెరీర్ నాశనం చేసిన వ్యక్తిని (అక్షయ్ ఖన్నా) ఒక హత్య కేసులో కాపాడాల్సి వస్తే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన కథాంశంతో ఇది రూపొందుతోంది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ లీగల్ డ్రామా మూవీకి.

2. Family Business

Advertisement

నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన మరో భారీ వెబ్ సిరీస్ ఇది. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, విజయ్ వర్మ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక బిలియనీర్ తన వారసుడిని ఎంపిక చేయడంతో తలెత్తే అధికార పోరాటం నేపథ్యంలో సాగే ఒక పవర్ డ్రామా సిరీస్. అనిల్ కపూర్ ఫ్యామిలీ హెడ్‌గా, కనిపించనున్నారు ఇందులో. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు కానీ ఈ ఏడాది తప్పకుండా వస్తుంది.

3. Dhindora 2

ఈ సిరీస్ మొదటి సీజన్ యూట్యూబ్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ‘దిండోరా సీజన్ 2’ మాత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ ఫా మ్‌లో విడుదల కానుంది. భువన్ బామ్ మరోసారి టీటూ మామ వంటి తన ఐకానిక్ పాత్రలతో ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఇందులో సమీర్, బాపూజీ మొదలైన క్యారెక్టర్స్ మళ్లీ వస్తున్నారు.

4. Hello Bachhon

Advertisement

ఈ బయోపిక్ సిరీస్ ఫిజిక్స్ టీచర్ ఆలఖ్ పాండే రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతోంది. ఒక సాధారణ టీచర్ ఎలా మిలియన్ల స్టూడెంట్స్‌కి ఇన్‌స్పైర్ అయ్యాడు, ఎడ్యుకేషన్‌ను అందరికీ అందుబాటులోకి ఎలా తెచ్చాడు అనే స్టోరీతో వస్తోంది. ఇప్పటికే దీని టీజర్ కూడా రిలీజ్ అయింది. Netflixలో 2026 మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

5. Hum Hindustani

ఇదొక హిస్టారికల్ డ్రామా మూవీ. సైఫ్ అలీ ఖాన్, ప్రతీక్ గాంధీ లీడ్ రోల్స్ ల్ప ఉన్నారు. ఇండియా స్వాతంత్ర్యం తర్వాత మొదటి జనరల్ ఎలక్షన్స్ (1951-52) గురించిన రియల్ స్టోరీ ఇది. Netflixలో 2026లో వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ ఏడాది తప్పకుండా రిలీజ్ అవుతుంది. హిస్టారికల్ లవర్స్‌కి బిగ్ సర్ప్రైజ్ ఈ మూవీ.

Read Also : ‘ది రాజా సాబ్’ నుంచి రాజ్ బి శెట్టి యాక్షన్ థ్రిల్లర్ వరకు.. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×