E-Paper
Advertisement

AC And induction: ఏసీ,ఇండక్షన్ ఒకేసారి వాడుతున్నారా? మీ కరెంట్ మీటర్ పేలిపోకముందే ఇది చూడండి!

AC And induction: ఏసీ,ఇండక్షన్ ఒకేసారి వాడుతున్నారా? మీ కరెంట్ మీటర్ పేలిపోకముందే ఇది చూడండి!
Advertisement

AC And induction: ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు వాడేటప్పుడు చిన్న అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా AC (ఎయిర్ కండిషనర్), ఇండక్షన్ స్టౌవ్‌ను ఒకేసారి ఉపయోగించడం వల్ల పవర్ ఓవర్లోడ్ సమస్యలు రావచ్చు. చాలా మందికి ఇది చిన్న విషయం అనిపించినా.. ఇది మీ మీటర్‌పై ప్రభావం చూపి.. ఫైన్‌ కూడా పడే పరిస్థితి తీసుకురావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో AC, ఇండక్షన్ స్టౌవ్ వంటి హై పవర్ ఎలక్ట్రికల్ వస్తువుల వాడకం పెరిగింది.  సమ్మర్ లో తప్పకుండా AC అవసరం అవుతుంది. అలాగే  వంట కోసం గ్యాస్ దొరకకపోవడంతో ఇండక్షన్ కూడా ప్రస్తుతం సౌకర్యంగా మారింది. కానీ ఈ రెండింటిని ఒకేసారి వాడటం వల్ల వచ్చే సమస్యలను చాలా మంది గమనించరు.

Advertisement

రెండూ ఒకే సారి వాడితే ?

AC , ఇండక్షన్ స్టౌవ్ రెండూ ఎక్కువ పవర్ తీసుకునేవి. ఇవి ఒకేసారి వీటిని ఆన్ చేస్తే, ఇంటి కరెంట్ లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీని వల్ల మీటర్‌పై ఒత్తిడి పెరిగి, ఓవర్లోడ్ పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీటర్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా వైర్లు వేడెక్కి ప్రమాదం కూడా జరగొచ్చు.

Advertisement

ఇదిలా ఉంటే చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్దేశించిన లోడ్ పరిమితి కూడా ఉంటుంది. మీరు ఆ పరిమితిని దాటితే.. అది రూల్స్‌కు విరుద్ధం అవుతుంది. ఈ పరిస్థితిలో అధికారులు మీపై ఫైన్ (జరిమానా) విధించే అవకాశం ఉంది. లేదంటే.. మీ కరెంట్ కనెక్షన్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేయొచ్చు.

కారణాలు:

ఇండక్షన్ స్టౌవ్ సాధారణంగా 1500W నుంచి 2000W వరకు పవర్ తీసుకుంటుంది. AC కూడా 1500W లేదా అంతకంటే ఎక్కువ పవర్ తో పనిచేస్తుంది. ఈ రెండు కలిపి వాడితే.. మొత్తం లోడ్ చాలా ఎక్కువ అవుతుంది. మీ ఇంటి వైరింగ్, మీటర్ సామర్థ్యం దీనిని తట్టుకోలేకపోవచ్చు. అయితే.. ఈ సమస్యను నివారించడం చాలా సులభం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..

1.ఏసీ, ఇండక్షన్‌ను ఒకేసారి వాడకండి.
2.అవసరమైతే లోడ్ కెపాసిటీ పెంచించుకోండి.
3.మంచి క్వాలిటీ వైరింగ్ ఉపయోగించండి.
4.ఎలక్ట్రిషియన్‌తో ఒకసారి చెక్ చేయించండి.

Also Read: తక్కువ బడ్జెట్‌లో టాప్ సెక్యూరిటీ.. రూ. 1500 లోపే బుల్లి కెమెరా, వెంటనే కొనేయండి

ఇలా చేయడం వల్ల మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఏసీ ఎక్కువగా వాడే సమయంలో ఈ జాగ్రత్తలు మరింత అవసరం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది ఈ రూల్స్ గురించి తెలియకుండానే తప్పు చేస్తారు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. కరెంట్ వాడకంలో జాగ్రత్తగా ఉండటం వల్ల మీరు డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రమాదాలను కూడా నివారించవచ్చు.

Also Read: మీ ఇంటినే సినిమా హాల్‌లా మార్చే.. TCL 55 ఇంచుల 4K UHD టీవీ బెస్ట్ ఫీచర్లు ఇవే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×