E-Paper
Advertisement

Bike Mileage: బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా? పెట్రోల్ బంక్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ బైక్ ని మైలేజ్ కింగ్ చేసేయండి!

Bike Mileage: బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా? పెట్రోల్ బంక్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ బైక్ ని మైలేజ్ కింగ్ చేసేయండి!
Advertisement

Bike Mileage: ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేట్లు చూస్తుంటే సామాన్యుడికి గుండె గుభేల్ అంటోంది. ఒకప్పుడు లీటర్ కొట్టిస్తే ఊరంతా తిరిగే రోజులు పోయి, దురదృష్టవశాత్తూ ఇప్పుడు బంక్ దాటకముందే రిజర్వ్‌లోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ లైఫ్ లో బైక్ అనేది కేవలం లగ్జరీ కాదు, అదొక ఎమోషన్! అందుకే హీరో నుంచి బజాజ్ దాకా ఏ బైక్ కొన్నా మనం ఫస్ట్ అడిగే ప్రశ్న “మైలేజ్ ఎంతిస్తుంది?”. అయితే కంపెనీ వాడు 80 వస్తుందని చెప్పినా, మన చేతికి వచ్చేసరికి అది 40 కి పడిపోతుంటుంది. నిజానికి దీనికి కారణం ఇంజిన్ ప్రాబ్లం మాత్రమే కాదు బాస్.. మనం బైక్ ని మెయింటైన్ చేసే వింత పద్ధతులు కూడా! మీ బైక్ ని పెట్రోల్ తాగే రాక్షసిలా కాకుండా, పొదుపుగా వెళ్లే దేవతలా మార్చుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని క్రేజీ ట్రిక్స్ ఫాలో అవ్వాలి.

అసలు విషయంలోకి వస్తే, చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సర్వీసింగ్ ని నెగ్లెక్ట్ చేయడం. ఇంజిన్ స్మూత్ గా ఉండాలంటే కంపెనీ చెప్పిన టైమ్ కి ఆయిల్ మార్పించాల్సిందే. ఒకవేళ తక్కువ ధరకి వస్తుందని లోకల్ ఆయిల్ పోయిస్తే, ఇంజిన్ లో ఘర్షణ పెరిగి అది పెట్రోల్ ని జర్రున తాగేస్తుంది. అంతేకాకుండా, చాలామంది టైర్లని అరిగిపోయేదాకా వదిలేస్తుంటారు. టైరుకి గ్రిప్ లేకపోయినా, గాలి తక్కువగా ఉన్నా రోడ్డు మీద పట్టు దొరకదు. ఫలితంగా ఇంజిన్ మీద లోడ్ పడి పెట్రోల్ వృథా అవుతుంది. అందుకే టైర్లలో ఎయిర్ ప్రెజర్ కరెక్ట్ గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

Advertisement

also read:Relationship secrets: రిలేషన్‌షిప్‌లో భార్య చేసే ఆ ఒక్క ‘సైలెంట్’ మిస్టేక్.. కాపురాన్ని కొల్లాప్స్ చేసేస్తుంది!

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన డ్రైవింగ్ స్టైల్! కొందరు సిగ్నల్ పడగానే అమాంతం యాక్సిలరేటర్ ఇచ్చి రేసు గుర్రంలా దూసుకెళ్తారు. కానీ అలా చేస్తే మైలేజ్ రాదు సరికదా, ఇంజిన్ లైఫ్ కూడా గోవిందా! దీనికి బదులుగా ప్రశాంతంగా, మీడియం  స్పీడ్ లో వెళ్లడం వల్ల మీ జేబుకి చిల్లు పడదు. అదేవిధంగా అనవసరంగా క్లచ్ నొక్కడం, పదే పదే బ్రేకులు వేయడం కూడా పెట్రోల్ కి శత్రువులే. వీటికి తోడు ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము పేరుకుపోతే ఇంజిన్‌కి ఊపిరాడదు, అప్పుడు అది ఆటోమేటిక్ గా ఎక్కువ పెట్రోల్ లాగేస్తుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, చైన్ సెట్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి.

Advertisement

నిజానికి బైక్ నడపడం ఒక ఆర్ట్! సిగ్నల్ దగ్గర 30 సెకన్ల కంటే ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తే వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయడం నేర్చుకోండి. ముఖ్యంగా గేర్లు మార్చేటప్పుడు స్పీడ్ కి తగ్గట్టుగా ఉండాలి తప్ప, తక్కువ స్పీడ్ లో టాప్ గేర్ వేసి ఇంజిన్ ని ఏడిపించకూడదు. ఎప్పుడైతే మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తారో, అప్పుడు మీ బైక్ మైలేజ్ అమాంతం పెరిగిపోతుంది. చివరికి పెట్రోల్ ఖర్చు మిగిలితే ఆ డబ్బుతో వీకెండ్ లో చక్కగా పార్టీ చేసుకోవచ్చు!

ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజే మీ బైక్ హెల్త్ చెక్ చేయండి, పెట్రోల్ ని ఆదా చేయండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ బైక్ ఒక మైలేజ్ మెషిన్ లా మారిపోవడం ఖాయం. సో రైడర్స్, అడ్డగోలుగా రేస్ చేయకండి, పొదుపుగా ప్రయాణించి మీ మనీని సేవ్ చేసుకోండి!

also read: Theatres: థియేటర్లు ఇక మూసుకోవాల్సిందేనా ?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×