E-Paper
Advertisement

ఇంట్లో ఏసీ ఉందా? రిమోట్లో ఈ ఒక్క బటన్ నొక్కండి.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు!

ఇంట్లో ఏసీ ఉందా? రిమోట్లో ఈ ఒక్క బటన్ నొక్కండి.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు!
Advertisement

Air Conditioner Tips: ఏసీని వాడే విషయంలో కొందరికి పెద్దగా అవగాహన ఉండదు. రిమోట్ లో ఆన్, ఆఫ్ బటన్లు మాత్రమే ఉపయోగిస్తూ.. ఏసీని వాడుతుంటారు. ముఖ్యంగా ఏసీ థర్మోస్టాట్ లోని ఫ్యాన్ సెట్టింగ్ ను ‘Auto’ లో ఉంచాలా? లేక ‘On’ లో ఉంచాలా? అనే దానిపై చాలామందికి క్లారిటీ ఉండకపోవచ్చు. అయితే తక్కువ పవర్ బిల్లు రావాలని భావిస్తే.. ఆటో సెట్టింగ్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. దాని ద్వారా విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

‘Auto’ సెట్టింగ్ ఎందుకు బెస్ట్?

ఏసీ Auto మోడ్‌లో ఉన్నప్పుడు నిర్దేశిత కూలింగ్ వచ్చేవరకు మాత్రమే ఫ్యాన్ తిరుగుతుంది. నిర్ణయించిన టెంపరేచర్ కు చేరుకోగానే.. ఫ్యాన్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లును భారీగా ఆదా చేయవచ్చని నిపుణులు అంటున్నారు. నెలకు రూ.1,000-2,500 భారం తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాదు ఏసీ కంప్రెసర్ తో పాటు ఫ్యాన్ కూడా ఆగిపోవడం వల్ల.. ఎవాపరేటర్ కాయిల్స్ పై ఉన్న తేమ బయటకు వెళ్లిపోతుందని నిపుణులు అంటున్నారు. ఫ్యాన్ అవసరమైనప్పుడు మాత్రమే తిరగడం వల్ల మోటారుపై ఒత్తిడి తగ్గి.. ఏసీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

‘On’లో ఉంచితే ఏమవుతుంది?

Advertisement

అయితే ఏసీ ఫ్యాన్ Onలో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు సైతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్ ఎప్పుడూ తిరుగుతూ ఉండటం వల్ల గదిలోని అన్ని మూలలకు గాలి సమానంగా అందుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా గాలి నిరంతరం ఫిల్టర్ ద్వారా వెళ్తూ ఉండటం వల్ల గాలిలోని ధూళి కణాలు తగ్గుతాయని తెలియజేస్తున్నారు. అయితే.. దీనివల్ల ఫిల్టర్లు త్వరగా మురికిగా మారే సమస్య కూడా ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు. కంప్రెసర్ ఆగిన తర్వాత కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటే కరెంట్ బిల్లు అనవసరంగా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Window AC vs Desert Cooler: ఏసీ వాడాలా? కూలర్ వాడాలా? సామాన్యులకు ఏది బెస్ట్?

ఫైనల్గా చెప్పేది ఏంటంటే?

Advertisement

ఆన్, ఆటో సెట్టింగ్స్ విషయంలో ఏసీ నిపుణులు ‘Auto’ సెట్టింగ్‌నే గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు ఆదా చేయడమే కాకుండా  గదిని ఆహ్లాదకరంగా ఉంచుతుందని పేర్కొంటున్నారు. ఒకవేళ మీ ఇంట్లో గాలి సరిగ్గా ఆడటం లేదనిపిస్తే అప్పుడు మాత్రమే కొద్దిసేపు “On” మోడ్ వాడటం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు వాడే ఏసీలో వేరియబుల్ స్పీడ్ బ్లోయర్ (Variable Speed Blower) ఉంటే దానిని ఆన్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు. అది ఆటోమేటిక్‌గా ఫ్యాన్ వేగాన్ని సర్దుబాటు చేసుకొని గదిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచుతుందని వివరిస్తున్నారు.

Also Read: Magic Figure: సీఎం కుర్చీకి.. ‘మ్యాజిక్ ఫిగర్’కు లింక్ ఏంటి? ఎందుకు అంత పవర్‌ఫుల్!

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×