E-Paper
Advertisement

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ వచ్చేస్తోంది.. ఓలా, ఏథర్ కు ఇక చుక్కలే!

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ వచ్చేస్తోంది.. ఓలా, ఏథర్ కు ఇక చుక్కలే!
Advertisement

Ultraviolette Tesseract EV: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్.. తొలి  ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. టెసరాక్ట్ పేరుతో వినియోగదారులకు ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ లతో గుర్తింపు పొందిన ఈ సంస్థ, ఇప్పుడు స్కూటర్ సెగ్మెంట్‌ లోకి  అడుగుపెడుతోంది. 2025లో తొలిసారి ఈ స్కూటర్‌ ను ప్రదర్శించగా, ఇప్పుడు దీని ప్రొడక్షన్ మోడల్ విడుదలకు రెడీ అయ్యింది. 2026 సెకెండ్ క్వార్టర్ లో ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ధర గురించి..

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షలుగా నిర్ణయించింది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌ సైట్ ద్వారా రూ.5,000 టోకెన్‌ తో ముందస్తు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ స్కూటర్‌ ను పూర్తిగా కొత్త ప్లాట్‌ ఫారమ్‌ పై తయారు చేశారు. ఇందులో 20.1 bhp శక్తిని ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది.  బ్యాటరీ ఆప్షన్ ను బట్టి స్కూటర్ రేంజ్ మారుతుంది. టాప్ వేరియంట్ ఒకే ఛార్జ్‌ పై గరిష్టంగా 261 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం 3.5 kWh, 5 kWh, 6 kWh అనే మూడు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులోకి రాబోతున్నాయి.  టెసరాక్ట్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే, దీని గరిష్ట వేగం 125 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కారణంగా బ్యాటరీని గంటలోపే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

అత్యాధునిక ఫీచర్లతో..

Advertisement

ఫీచర్ల విషయంలో అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ చాలా ముందుంటుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ TFT డిస్‌ ప్లే ఇచ్చారు. ఇందులో నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ముందు, వెనుక భాగాల్లో డ్యూయల్ డాష్‌ క్యామ్‌ లు ఉన్నాయి. అలాగే వైర్‌ లెస్ ఛార్జింగ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యాండిల్‌ బార్‌ పై హాప్టిక్ ఫీడ్‌ బ్యాక్ సిస్టమ్ కూడా అందించారు.

ఈ స్కూటర్‌ లో కీలక ప్రత్యేకత రాడార్ ఆధారిత అడ్వాన్స్‌ డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్. మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో ఈ టెక్నాలజీ రావడం ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా బ్లైండ్ స్పాట్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్‌ టేక్ వార్నింగ్, కొలిజన్ అలర్ట్స్ లాంటి భద్రతా ఫీచర్లు పనిచేస్తాయి. రైడర్‌ కు ప్రయాణంలో అదనపు భద్రత లభిస్తుంది.

Advertisement

ఇక టెసరాక్ట్‌ లో 34 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్ ఉంది. అందులో ఫుల్ ఫేస్ హెల్మెట్ సులభంగా పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్ 14 అంగుళాల వీల్స్‌ పై నడుస్తుంది. సోనిక్ పింక్, డెసర్ట్ సాండ్, సోలార్ వైట్, స్టెల్త్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌ పై మూడు సంవత్సరాలు లేదంటే 75,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. అదనంగా వారంటీని 8 సంవత్సరాలు లేదంటే 2 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్కూటర్ మార్కెట్ లో  ఓలా S1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్,  ఏథర్ 450, సింపుల్ వన్, విడా V2 ప్రో, రివర్ ఇండి లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: స్పోర్టీ స్కూటర్ ఏరాక్స్ ధరలు పెంపు, కొనుగోలుదారులకు షాకిచ్చిన యమహా!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×