AC Blast Prevention Tips: ఏసీలు బాంబుల్లా పేలుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. తాజా దిల్లీలో మాజీ ఐఏఎస్ ఇంట్లో ఏసీ పేలిపోయి.. ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఏసీ ఇండోర్ యూనిట్ ఒక్కసారిగా పేలిపోవడంతో 80 ఏళ్ల ధనేంద్రకుమార్ ప్రాణాలు విడిచారు. దీంతో ఏసీల భద్రతపై మరోవైపు చర్చ మెుదలైంది. దిల్లీ లాంటి ఘటనలో తమ ఇంట్లోనూ జరుగుతుందా? అన్న అందోళన ఏసీ యూజర్లలో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏసీలు పేలకుండా ఉండేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఏసీని రోజంతా కంటిన్యూగా ఆన్ చేసి ఉంచొద్దు. దీనివల్ల ఏసీ కంప్రెషర్ పై విపరీతమైన భారం పడి అది బాగా వేడెక్కిపోయి (ఓవర్ హీట్) పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్ యమధ్యలో ఏసీకి కొంచెం గ్యాప్ (రెస్ట్) ఇవ్వడం చాలా ముఖ్యమని నిపుణులు చూస్తున్నారు.
ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. ఏసీ ఫిల్టర్లలో దూళి పేరుకుపోయినా లోపల గ్యాస్ లీకేజీలు ఉన్నా కంప్రెషర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రొఫెషనల్ మెకానిక్‌తో సర్వీస్ చేయిస్తే ఇలాంటి లోపాలు ముందే బయటపడతాయని అంటున్నారు
ఏసీకి వాడే వైర్లు నాణ్యమైనవో కాదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడైనా వైర్లు నలిగిపోయినా లేదా కనెక్షన్లు లూజ్‌గా ఉన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పవర్ ప్లగ్ దగ్గర వైర్లు వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఎలక్ట్రీషియన్‌ని పిలిపించాలని హితవు పలుకుతున్నారు.
వేసవిలో పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స్) చాలా కామన్‌గా జరుగుతుంటాయి. వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగినా, తగ్గినా ఏసీ మిషన్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఒక మంచి క్వాలిటీ ఉన్న వోల్టేజ్ స్టెబిలైజర్‌ని వాడటం వల్ల ఏసీలో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా సేఫ్‌గా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఏసీ రిపేరుకు వచ్చినప్పుడు డబ్బు ఆదా అవుతుందని కొందరు లోకల్, తక్కువ క్వాలిటీ ఉన్న స్పేర్ పార్ట్స్, వైర్లు వాడుతుంటారు. ఈ తప్పు అస్సలు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ పార్ట్స్ మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. లేదంటే అవి ఏసీ లోపల వచ్చే వేడిని తట్టుకోలేక కాలిపోతాయని దీని వల్ల అగ్నిప్రమాదాలు జరగొచ్చని సూచిస్తున్నారు.
ఏసీ ఆన్ చేసినప్పుడు లోపల నుండి ఏవైనా వింత శబ్దాలు వస్తే వెంటనే మెకానిక్ ను సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఏదైనా వైర్ కాలిన వాసన వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఏసీ కూలింగ్ ఇవ్వకపోవడం, వేడి గాలి బయటకు రావడం వంటి సంకేతాలు కనిపించినా ఏసీని వెంటనే ఆఫ్ చేయాలని హితవు పలుకుతున్నారు.
Also Read: ఏసీ ఆఫ్ చేసినా గది చల్లగా ఉండాలా? ఈ 6 ట్రిక్స్ పాటిస్తే.. రోజంతా కూల్ కూల్!
వేసవిలో బయట ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల వరకు దాటిపోతుంటాయి. ఈ టైమ్‌లో ఏసీలు గదిని చల్లబరచడానికి మామూలు రోజుల కంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆ మిషన్ల పై ఒత్తిడి ఎక్కువై ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. కాబట్టి ఫ్యామిలీ భద్రత కోసం ఈ చిన్న చిన్న విషయాల్లో అలసత్వం వహించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం