E-Paper
Advertisement

AC Cleaning Tips: ఏసీ సర్వీసింగ్ సిగ్నల్స్.. ఇంటి చిట్కాలతో ఇట్టే క్లీనింగ్

AC Cleaning Tips: ఏసీ సర్వీసింగ్ సిగ్నల్స్.. ఇంటి చిట్కాలతో ఇట్టే క్లీనింగ్
Advertisement

AC Cleaning Tips: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవాలంటే ప్రతి ఇంట్లో ఈసీ ఉండాల్సిన పరిస్థితి. అయితే సమ్మర్ ఫుల్ స్వింగ్ లోకి రాకముందే మీ ఏసీ క్లీన్ చేసుకోండి. సమ్మర్ హీట్ కు మీ ఏసీ ఓవర్ టైం పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏసీ కూలింగ్ రాకపోతే.. క్లీనింగ్ కు సిగ్నల్ ఇచ్చినట్లే అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. విండో ఏసీ యూనిట్లను ప్రతి రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. లేకపోతే డస్ట్ చేరి ఏసీ వర్కింగ్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇంట్లో గాలి కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. సెంట్రల్ ఏసీ యూనిట్లను ఏడాదికి ఒకసారి ప్రొఫెషనల్ తో క్లీన్ చేయించడం మంచిది.

ఏసీ సర్వీసింగ్ టైం అని ఎలా తెలుస్తోంది.

1. ఏసీ నుంచి కూలింగ్ రాకుండా ఎయిర్ వస్తుంటే సర్వీసింగ్ టైం వచ్చిందని అర్ధం.
2. ఏసీ నుంచి బ్లోవర్ సౌండ్, అలాగే ఎక్కువ శబ్దం చేస్తున్నా, డిఫరెంట్ స్మెల్ వస్తున్నా క్లీనింగ్ టైం అని గుర్తించండి.
3. ఏసీ మురికిగా కనిపించడం, యూనిట్ లో దుమ్ము, ధూళి పెరుకుపోవడం, రన్‌ఆఫ్ పాన్‌లో దుమ్ము లేదా బూజును గమనించినట్లయితే, మీ ఏసీని శుభ్రం చేసుకోవాలి.
4. కరెంట్ బిల్లు భారీగా వస్తుంటే.. దానికి ఏసీ కూడా కారణం కావచ్చు. ఏసీ క్లీనింగ్ కు ఇది కూడా ఒక సిగ్నల్.

Advertisement

తేలికపాటి డిష్ సోప్ తో AC యూనిట్ ను క్లీన్ చేసుకోవచ్చు. ఏసీలో ఫిల్టర్లు, కాయిల్స్ కీలకం. ఫిల్టర్లు గాలిలోని దుమ్మును తొలగిస్తాయి. దుమ్ముతో అవి మూసుకుపోయే AC యూనిట్‌పై భారం పడుతుంది. కాయిల్స్ వేడి, చల్లని గాలిని ట్రాన్స్ ఫర్ చేస్తాయి. ఈ కాయిల్స్ కు దమ్ము పట్టేస్తే కూలింగ్ సరిగ్గా రాదు.

ఏసీ క్లీనింగ్ చిట్కాలు

ఏసీని క్లీన్ చేసే ముందు యూనిట్ ను ఆఫ్ చేయండి. అలాగే పవర్‌ ఆఫ్ చేసి, అన్‌ప్లగ్ చేయండి. ఏసీ యూనిట్ పై కవర్ తీసివేసి, ఫిల్టర్‌ ను బయటకు తీయండి. ఏసీ మాన్యువల్ లో ఫిల్టర్ ఎలా తీయాలో ఉంటుంది. ఫిల్టర్ పై దుమ్మును మెత్తని గుడ్డతో తుడవండి. గోరువెచ్చని నీరు, సబ్బు వాటర్ తో శుభ్రం చేసుకోండి. ఫిల్టర్‌ను తిరిగి ఫిక్స్ చేసే ముందు పూర్తిగా ఆరనివ్వండి.

Advertisement

Also Read:   మిషన్‌లో.. బట్టలతో పాటు ఇవి కూడా వేస్తున్నారా? కొంపలు అంటుకుంటాయ్ జాగ్రత్త!

ఏసీ కాయిల్స్‌ను స్మూత్ బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేయండి. కాయిల్స్‌పై దుమ్ము ఎక్కువగా ఉంటే, కాయిల్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. బయట ఉండే అవుట్ డోర్ యూనిట్ కాయిల్స్ క్లీన్ చేయడానికి ప్రెషర్ వాషర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఏసీ డ్రెయిన్ పైపులో అడ్డుపడిన దుమ్మును తొలగించడానికి, ఒక సన్నని వైరు లేదా పైపును ఉపయోగించవచ్చు. డ్రెయిన్ పైపును క్లీన్ చేయడానికి వేడి నీటిని ఉపయోగించాలి. ఏసీ బయటి భాగాన్ని తడి గుడ్డతో తుడవాలి. బయటి భాగంలో దుమ్ము ఎక్కువగా ఉంటే, సబ్బు నీటిని ఉపయోగించవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×