E-Paper
Advertisement

వావ్.. రాత్రిపూట ఏసీని Sleep Modeలో పెడితే.. కరెంట్ బిల్లు ఇంతలా తగ్గుతుందా?

వావ్.. రాత్రిపూట ఏసీని Sleep Modeలో పెడితే.. కరెంట్ బిల్లు ఇంతలా తగ్గుతుందా?
Advertisement

AC Sleep Mode Benefits: ఎండకాలం వచ్చిందంటే చాలు పగలే కాదు.. రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో చాలా ఇళ్లల్లో రాత్రంతా ఏసీలు నాన్‌స్టాప్‌గా తిరుగుతూనే ఉన్నాయి. అయితే, ఉదయం లేచి ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చుందామంటే.. నెల తిరిగేసరికి వచ్చే కరెంట్ బిల్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏసీ వాడకుండా ఉండలేం, అలాగని బిల్లు కట్టలేం.. ఇలాంటి పరిస్థితేనా మీది కూడా?

అయితే మీకొక గుడ్ న్యూస్. మీ ఏసీ రిమోట్‌లో ఉండే ఒకే ఒక్క మ్యాజికల్ బటన్ మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గించగలదు. అదే Sleep Mode. రాత్రి పడుకునేటప్పుడు ఏసీని స్లీప్ మోడ్‌లో పెడితే కరెంట్ బిల్లు ఎంత తగ్గుతుందో.. అసలు ఇది ఎలా పని చేస్తుందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.

ఏమిటీ స్లీప్ మోడ్?

Advertisement

ఇది దాదాపు అన్ని ఆధునిక ఎయిర్ కండిషనర్లలో ఉండే ఒక మంచి ఫీచర్. రాత్రి వేళల్లో గది ఉష్ణోగ్రతను ఇది క్రమంగా మారుస్తూ ఉంటుంది. రూమ్‌ను ఎప్పుడూ ఒకేలా విపరీతంగా చల్లబరచకుండా, సమయాన్ని బట్టి మార్పులు చేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

మనం స్లీప్ మోడ్ ఆన్ చేసినప్పుడు.. ఏసీలో టెంపరేచర్ ప్రతి 1 డిగ్రీ పెరిగేకొద్దీ.. సుమారు 6% నుండి 7% వరకు కరెంట్ ఆదా అవుతుంది.. కొద్దిసేపటి తర్వాత గది వాతావరణం మరీ చల్లగా కాకుండా, నిద్రపోవడానికి వీలుగా ప్రశాంతంగా మారుతుంది. సాధారణ మోడ్‌లో ఏసీ రాత్రంతా ఒకే చలిని ఇస్తుంది. కానీ స్లీప్ మోడ్ ఆ ఇబ్బంది లేకుండా చూస్తుంది.

Advertisement

Also Read: ఎండలు మండిపోతున్నా నో వర్రీ.. మెడలో వేసుకుని స్మార్ట్ ACని తెచ్చిన సోనీ.. రేట్ ఎంతంటే?

ఎనర్జీ సేవర్‌కు దీనికి తేడా ఏంటి?

చాలామంది స్లీప్ మోడ్, ఎనర్జీ సేవర్ మోడ్ రెండూ ఒక్కటే అనుకుంటారు. కానీ వీటి పనితీరు వేరు. ఎనర్జీ సేవర్ మోడ్‌లో గది చల్లబడగానే కంప్రెసర్, ఫ్యాన్ ఆగిపోతుంటాయి. కానీ స్లీప్ మోడ్ కేవలం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి, మన శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఏసీ టెంపరేచర్‌ను సర్దుబాటు చేయడానికి డిజైన్ చేయబడింది.

పెరిగిన ఏసీల వాడకం..

ఈ మధ్యకాలంలో ఎండలు, వడగాల్పులు పెరిగిపోవడంతో ఏసీ వాడకం తప్పనిసరైంది. దాంతో పాటే కరెంట్ బిల్లులు కూడా భారంగా మారుతున్నాయి. అందుకే చాలా ఇళ్లల్లో ఇప్పుడు ఏసీలను విపరీతంగా వాడుతున్నారు. పైన చెప్పిన విధంగా ఏసీ వాడేటప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటే.. విద్యుత్ ఆదాతో పాటు ఏసీ కూడా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.

Also Read: AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×