E-Paper
Advertisement

ఎండలు మండిపోతున్నా నో వర్రీ.. మెడలో వేసుకుని స్మార్ట్ ACని తెచ్చిన సోనీ.. రేట్ ఎంతంటే?

ఎండలు మండిపోతున్నా నో వర్రీ.. మెడలో వేసుకుని స్మార్ట్ ACని తెచ్చిన సోనీ.. రేట్ ఎంతంటే?
Advertisement

Sony Neck AC: ఎండలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. దీంతో బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తీవ్రమైన వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇచ్చేందుకు ప్రముఖ టెక్ సంస్థ సోనీ ఒక అద్భుతమైన పరికరాన్ని మార్కెట్లోకి తెచ్చింది. అదే Reon Pocket Pro Plus. ఇది మన మెడలో సులువుగా అమరిపోయే ఒక వేరబుల్ ఎయిర్ కండిషనర్. ప్రయాణాలు చేసేటప్పుడు, బయట తిరిగేటప్పుడు కూడా ఇది మనల్ని ఎంతో చల్లగా ఉంచుతుంది.

మెడలోనే ఏసీ ఎఫెక్ట్:

ఈ డివైజ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని మన బట్టల లోపల మెడ వెనుక భాగంలో అమర్చుకోవాలి. దీనిలో ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ కూలింగ్ ప్యానెల్ నేరుగా మన చర్మానికి తగులుతూ చల్లదనాన్ని ఇస్తుంది. పాత మోడళ్లతో పోలిస్తే.. ఇది 20 శాతం మెరుగ్గా పనిచేస్తుందని, దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అదనపు చల్లదనాన్ని అందిస్తుందని సోనీ చెబుతోంది. మెడ వెనుక భాగంలో ఇది చల్లదనాన్ని అందించినప్పటికీ.. ఆ కూలింగ్ శరీరం మొత్తానికి ఉంటుంది.

వింటర్‌లోనూ వాడొచ్చు:

Advertisement

రోజువారీ వాడకానికి వీలుగా దీని డిజైన్‌లో చాలా మార్పులు చేశారు. నడుస్తున్నప్పుడు లేదా చిన్నపాటి పనులు చేస్తున్నప్పుడు కూడా ఊడిపోకుండా ఉండేలా ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్‌ను ఇచ్చారు. కేవలం ఎండకాలంలోనే కాకుండా.. శీతాకాలంలో ఒంటికి వెచ్చదనాన్ని ఇవ్వడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సెకండ్ హయ్యస్ట్ సెట్టింగ్‌లో దాదాపు 10 గంటల పాటు ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది.

Also Read: అలెక్సా సపోర్ట్‌తో సరికొత్త అమెజాన్ స్మార్ట్ స్పీకర్లు.. ఇక రూమ్‌లోకి రాగానే అన్నీ ఆటోమేటిక్!

స్మార్ట్ సెన్సార్ల అండ:

Advertisement

ఈ పరికరంలో అమర్చిన సెన్సార్లు మన శరీర ఉష్ణోగ్రతను గమనిస్తూ సురక్షితమైన చల్లదనాన్ని ఇస్తాయి. దీంతోపాటు ఒక ‘పాకెట్ ట్యాగ్’ కూడా వస్తుంది. దీన్ని బ్యాగ్‌కు లేదా బెల్టుకు తగిలించుకుంటే.. అది బయట వాతావరణంలోని వేడి, తేమను అంచనా వేసి మెడలోని ఏసీకి సమాచారం అందిస్తుంది. తద్వారా బయట ఉన్న ఎండను బట్టి ఇది ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. వేడి గాలి బయటకు వెళ్లేందుకు వీలుగా దీనికి అడ్జస్టబుల్ వెంట్స్ కూడా ఉన్నాయి.

ధర వివరాలు ఇలా:

ఈ సరికొత్త కూలింగ్ డివైజ్ ప్రస్తుతం యూకే, యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. యూకేలో దీని ధర సుమారు రూ.25,578, యూరప్‌లో రూ.25,409గా ఉంది. అయితే ఈ డివైజ్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై సోనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ భారత్‌లోకి వస్తే మాత్రం ఎండలతో ఇబ్బంది పడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది.

Also Read: టెక్ ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. Galaxy Z Fold 4పై ఏకంగా రూ.65వేలు తగ్గింది, స్టాక్ లిమిటెడ్ మావా!

Related News

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

Big Stories

Advertisement
×