E-Paper
Advertisement

రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు రాకూడదా? రిమోట్లోని ఈ ‘మ్యాజికల్’ బటన్ నొక్కాల్సిందే!

రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు రాకూడదా? రిమోట్లోని ఈ ‘మ్యాజికల్’ బటన్ నొక్కాల్సిందే!
Advertisement

AC Tips: ప్రస్తుత వేసవిలో ఏసీ లేనిదే పూట గడవడం లేదు. ముఖ్యంగా రాత్రిళ్లు హాయిగా నిద్రించాలంటే ఏసీ అత్యవసరంగా మారిపోయింది. అలాగనీ రాత్రంతా ఏసీ వేస్తే.. కరెంటు బిల్లు పేలిపోతోందని పలువురు వాపోతున్నారు. దీని నుంచి బయటపడే మార్గం లేదా? అంటూ వాపోతున్నారు. అలాంటి వారి కోసం ఏసీలోనే దాగున్న అద్భుతమైన ఫీచర్ ను ఈ కథనంలో వివరించడం జరుగుతోంది. ఇది మీ జేబుకు చిల్లు పడకుండా.. రాత్రంతా హాయిగా నిద్రపోయేందుకు సాయపడుతుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

స్లీప్ మోడ్ గురించి తెలుసా?

సాధారణంగా ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత సహజంగానే కొద్దిగా తగ్గుతుంది. అటు రూమ్ టెంపరేచర్ సైతం ఆటోమేటిక్ గా తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా తెల్లవారుజామున చలిగా అనిపించి చాలా మందికి ఇట్టే మెలకువ వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీలోని ‘స్లీప్ మోడ్’ను ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రాత్రివేళ ఏసీ రిమోట్ లో ఈ మోడ్ ను ఆన్ చేస్తే.. ప్రతి గంటకు 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా పెంచుతుంది.

కరెంట్ బిల్లు ఆదా

Advertisement

ఏసీ కంప్రెషర్ నిరంతరం తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. కానీ స్లీప్ మోడ్‌లో ఉష్ణోగ్రత కొద్దిగా పెరగడం వల్ల కంప్రెషర్‌పై లోడ్ తగ్గుతుంది. దీనివల్ల సాధారణ మోడ్‌తో పోలిస్తే దాదాపు 20 శాతం నుండి 30 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుందని నిపుణులు అంటున్నారు.

మెరుగైన ఆరోగ్యం, హాయిగా నిద్ర

రాత్రంతా ఒకే విధమైన చల్లదనం ఉంటే ఉదయాన్నే గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, జలుబు చేసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్లీప్ మోడ్ లో ఏసీని ఉంచడం వల్ల గదిలో సరైన తేమను, శరీరానికి సరిపోయే వెచ్చదనాన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి అసౌకర్యం లేకుండా గాఢ నిద్ర పడుతుందని వివరిస్తున్నారు. ఉదయాన్ని తమ విధులకు ఎంతో ఉత్సాహంగా వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: మీ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? వెంటనే ఇలా చేయకపోతే.. తప్పదు భారీ మూల్యం!

మరో చిన్న చిట్కా..

రాత్రి పడుకునే ముందు ఏసీని 24°C లేదా 25°C వద్ద సెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు మరోమారు సూచిస్తున్నారు. అనంతరం రిమోట్ లోని ‘Sleep’ బటన్ నొక్కడం ద్వారా.. స్లీప్ మోడ్ ను ఆన్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఈ చిట్కా.. అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి, డబ్బు ఆదాకు సైతం మేలు చేస్తుందని వివరిస్తున్నారు.

Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×