E-Paper
Advertisement

AC tips: సమ్మర్ వచ్చేసింది.. ఏసీని ఆన్ చేసే ముందు ఈ 4 పనులు తప్పక చేయండి!

AC tips: సమ్మర్ వచ్చేసింది.. ఏసీని ఆన్ చేసే ముందు ఈ 4 పనులు తప్పక చేయండి!
Advertisement

AC tips: సమ్మర్ వచ్చేసింది.. క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో అప్పుడే అందరూ ఏసీల వైపు చూస్తున్నారు. అయితే, గత కొన్ని నెలలుగా వాడకుండా పక్కన పెట్టిన ఏసీని డైరెక్ట్‌గా ఆన్ చేసేయకండి. అది మీ ఆరోగ్యానికే కాదు.. మీ జేబుకి కూడా అస్సలు మంచిది కాదు. దుమ్ము ధూళి పేరుకుపోవడం వల్ల ఏసీ కూలింగ్ తగ్గిపోవడమే కాకుండా, కరెంటు బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. అందుకే, మీరు ఈ సీజన్‌లో మొదటిసారి ఏసీని ఆన్ చేసే ముందు ఈ జాగ్రత్తలు మాత్రం అస్సలు మర్చిపోకండి.

సర్వీసింగ్ చాలా ముఖ్యం:

ఏసీని ఆన్ చేసే ముందే ఒకసారి ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించుకోవడం అన్నిటికంటే బెస్ట్. నెలల తరబడి ఏసీ ఖాళీగా ఉండటం వల్ల ఫిల్టర్లు, కాయిల్స్‌లో విపరీతంగా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. దీంతో ఏసీ గాలిని పీల్చుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కవ వస్తుంది. కనీసం మీరు ఫిల్టర్లను తీసి క్లీన్ చేసినా కూలింగ్ బాగుంటుంది.

Advertisement

Also Read: ఐఫోన్‌కు చెక్ పెట్టేలా iQOO కొత్త ఫోన్.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5తో భారత్‌లోకి!

లీకేజీలపై ఓ కన్నేయండి:

ఏసీ ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లను ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా వాటర్ బయటకు వెళ్లే డ్రైన్ పైపులో ఏవైనా అడ్డంకులు ఉన్నాయేమో చూడండి. అలాగే, గ్యాస్ లీకేజీ లాంటి సమస్యలు ఏవైనా ఉంటే ముందే గుర్తించడం మంచిది. దీనివల్ల తర్వాత వచ్చే భారీ ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.

వైరింగ్, స్టెబిలైజర్:

Advertisement

చాలా రోజుల తర్వాత ఏసీ వాడుతున్నప్పుడు వైర్లు ఎక్కడైనా కట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేయండి. ఒక్కోసారి ఎలుకల వల్ల వైర్లు దెబ్బతింటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మీ స్టెబిలైజర్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకోవడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి ఏసీని కాపాడుకోవచ్చు.

ఫ్యాన్ మోడ్‌ ఆన్ చేయండి:

ఏసీ స్విచ్ వేయగానే వెంటనే కూల్ మోడ్‌లో పెట్టేయకండి. మొదట ఫ్యాన్ మోడ్‌లో పెట్టి ఓ అరగంట పాటు రన్ అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల ఏసీ లోపల పేరుకుపోయిన దుమ్ము, తేమ, దుర్వాసన అన్నీ బయటకు పోతాయి. ఆ తర్వాత కూల్ మోడ్ ఆన్ చేస్తే.. ఏసీ త్వరగా చల్లబడటమే కాకుండా మిషన్ మీద లోడ్ కూడా పడదు.

Also Read: మొబైల్‌ను ఒక్క చేత్తో పట్టుకుని రీల్స్, షార్ట్స్ చూడటం కష్టంగా ఉందా? ఈ గ్యాడ్జెట్స్ మీ కోసమే!

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×