E-Paper
Advertisement

Acer Chromebook Spin 311: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి రెండు అదిరిపోయే క్రోమ్‌బుక్స్ లాంచ్!

Acer Chromebook Spin 311: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి రెండు అదిరిపోయే క్రోమ్‌బుక్స్ లాంచ్!
Advertisement

Acer Chromebook Spin 311: నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్ అనేది ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. క్లాస్ రూంలో పాఠాలైనా, ఆన్‌లైన్ అసైన్‌మెంట్లైనా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. అందుకే విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్ సంస్థ Acer రెండు సరికొత్త మోడళ్లను విడుదల చేసింది. Acer Chromebook Spin 31, Acer Chromebook 311 పేరుతో విడుదలైన ఈ మోడల్స్ సాధారణ ల్యాప్‌టాప్‌ల కంటే మెరుగైన పనితీరును అందిస్తుంది.

గూగుల్ ChromeOS పవర్‌తో..

ఈ రెండు క్రోమ్‌బుక్‌లు గూగుల్ రూపొందించిన ChromeOSపై రన్ అవుతాయి. క్లాస్‌రూమ్ అప్లికేషన్లు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవడానికి ఇది చాలా స్పీడ్‌గా స్పందిస్తుంది. దీనిలో తొలిసారిగా మీడియాటెక్ కంపానియో 540 ఆక్టా‌కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఇది ల్యాప్‌టాప్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచడమే కాకుండా.. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తుంది. ఒక గ్రాఫిక్స్ కోసం మాలి-G57 GPUని ఉపయోగించడం వల్ల విద్యార్థులు ప్రాజెక్ట్‌ వర్క్‌లను మరింత గ్రాఫికల్‌గా రూపొందించుకోవచ్చు.

360 డిగ్రీల ఫ్లెక్సిబిలిటీ..

Advertisement

Acer Chromebook Spin 31 డిజైన్ విషయానికి వస్తే.. 360 డిగ్రీల హింజ్ సహాయంతో ల్యాప్‌టాప్‌ను మనకు నచ్చినట్లుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే Chromebook 311 సాధారణ ల్యాప్‌టాప్ మోడల్‌లో వస్తుంది. ఈ రెండింటిలోనూ 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు బ్లూ లైట్ ఫిల్టర్ ఫీచర్, గీతలు పడకుండా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టర్‌ను కూడా ఇచ్చారు.

15 గంటల బ్యాటరీ బ్యాకప్..

చాలామంది ల్యాప్‌టాప్ వాడేటప్పుడు ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో అని భయపడుతుంటారు. కానీ ఈ ఏసర్ క్రోమ్‌బుక్ విషయంలో అలాంటి భయం లేదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 15 గంటల పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు. ఇక మెమరీ విషయానికి వస్తే.. 8GB RAM, 128GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

స్పీడ్ ఇంటర్నెట్‌కు సపోర్ట్..

Advertisement

ఆన్‌లైన్ క్లాసులు లేదా వీడియో కాల్స్ కోసం దీనిలో 1080p ఫుల్ హెచ్‌డీ వెబ్‌క్యామ్ ఇచ్చారు. ప్రైవసీ కోసం దీనికి ఒక షట్టర్ కూడా ఉంది. డేటా భద్రత కోసం టైటాన్ సి మాడ్యూల్, ఫిజికల్ లాక్ స్లాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే లేటెస్ట్ వైఫై 7 సపోర్ట్ ఉండటం వల్ల ఇంటర్నెట్ కూడా స్పీడ్‌గా ఉంటుంది.రెండు టైప్ సి పోర్ట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌లు, ఆడియో జాక్ వంటి అన్ని అవసరమైన పోర్ట్‌లను సైతం కంపెనీ అందించింది.

ధర ఎంతంటే?

ఈ రెండు ల్యాప్‌టాప్‌లు మార్చి నెల నుండి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ధరల విషయానికి వస్తే.. Acer Chromebook 311 సుమారు రూ.35,200 నుండి ప్రారంభం కాగా.. Acer Chromebook Spin 31 ధర సుమారు రూ.40,600 నుండి ప్రారంభం అవుతుందని సమాచారం.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×