E-Paper
Advertisement

Crime Thriller OTT : పోలీస్ స్టేషన్ లోనే మకాం పెట్టే సీరియల్ కిల్లర్… గ్రిప్పింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller OTT : పోలీస్ స్టేషన్ లోనే మకాం పెట్టే సీరియల్ కిల్లర్… గ్రిప్పింగ్  కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : కొరియన్ సినిమాలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. వీటిని క్రేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక వెబ్ సిరీస్ లను అస్సలు వదలడం లేదు. ఇక యాక్షన్ థ్రిల్లర్ స్టోరీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఒక డిటెక్టివ్ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కథ. ఈ కిల్లర్ సమాజంలో తప్పులు చేసి తప్పించుకున్న నేరస్థులను మాత్రమే చంపుతూ, పోలీసులను ముప్ప తిప్పలు పెడుతుంటాడు. యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే .. .

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ యాక్షన్ థ్రిల్లర్ కొరియన్ సినిమా పేరు ‘ఐ, ద ఎగ్జిక్యూషనర్’ (I, the Executioner). ఇది 2015 నాటి బ్లాక్ బస్టర్ ‘వెటరన్’ (Veteran) కు సీక్వెల్. ఈ చిత్రం 2024 మే 21న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిడ్‌నైట్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శించబడి, 2024 సెప్టెంబర్ 13న థియేటర్‌లలో విడుదలైంది. హ్వాంగ్ జంగ్-మిన్, జంగ్ హే-ఇన్ నటించిన ఈ సినిమాకి ర్యో సీయుంగ్-వాన్ దర్శకత్వం వహించారు. Apple tv + లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డిటెక్టివ్ దో-చోల్ అండర్ లో ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద నేరాలను, అంతుచిక్కని క్రైమ్ మిస్టరీలను సాల్వ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ కిల్లర్ చట్టం నుండి తప్పించుకున్న కరుడుగట్టిన నేరస్థులను లక్ష్యంగా చేసుకుని, వాళ్ళు చేసిన నేరాల తరహాలోనే వాళ్ళని అత్యంత క్రూరంగా శిక్షిస్తుంటాడు. ఈ హత్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు అతన్ని ఒక ‘హీరో’గా చూడటం మొదలుపెడతారు. దీనివల్ల పోలీసులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో పార్క్ సున్-వూ అనే చురుకైన పోలీసు అధికారి, ఈ కేసును ఛేదించడంలో దో-చోల్ టీమ్ లో చేరతాడు.

కేసు దర్యాప్తు అవుతున్న కొద్దీ, కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కనిపెట్టడానికి పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. అయితే ఈ క్రమంలో కొత్తగా చేరిన అధికారి పార్క్ సున్-వూ ప్రవర్తనలో కొన్ని మార్పులను దో-చోల్ గమనిస్తాడు. అలాగే కిల్లర్ ఎవరనేది క్లైమాక్స్ లో ఊహించని షాక్ ఇస్తుంది ఈ సినిమా. కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అతని గతం ఏమిటి ? కొత్తగా వచ్చిన పోలీస్ లో దో-చోల్ గమనించింది ఏమిటి ? అనే విషయాలను, ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోండి.

Advertisement

Read Also : చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళకు మాత్రమే కన్పించే షాప్… దిమ్మతిరిగే ట్విస్టులు

Tags

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×