ACwO DwOTS Sense TWS: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో.. మ్యూజిక్ లవర్స్ కోసం రకరకాల ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, గంటల తరబడి వాడేందుకు ‘ఓపెన్ వైర్‌లెస్ స్టేరియో’ డిజైన్ ట్రెండ్‌గా మారింది. ఈ కోవకే.. చెందిన సరికొత్త గాడ్జెట్ ఈ మోడల్. కేవలం రూ.2,099 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో.. వస్తున్న ఈ డివైస్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణ ఇయర్ బడ్స్ లాగా కాకుండా, ACwO సంస్థ ఈ డివైస్‌ను OWS డిజైన్‌తో తీర్చిదిద్దింది. ఇవి చెవి లోపలికి చొచ్చుకుపోకుండా.. బయటే ఉంటూ అద్భుతమైన సౌండ్‌ను అందిస్తాయి. దీని వల్ల ఎక్కువ సేపు మ్యూజిక్ విన్నప్పటికీ చెవుల్లో.. నొప్పి పుట్టడం లేదా చెవిపోటు సమస్యలు రావడం జరగదు. అంతేకాకుండా.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో వింటూనే మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రన్నింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ వేరియంట్ ఈ ఇయర్‌బడ్స్‌కు మరింత ప్రీమియం , క్లాసీ లుక్‌ను తెచ్చిపెట్టింది.
వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించే.. ముఖ్యమైన అంశం బ్యాటరీ లైఫ్. ఈ విషయంలో ఈ మోడల్ యూజర్లను అస్సలు నిరుత్సాహపరచదు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 65 గంటల భారీ ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు వారం రోజుల పాటు మళ్లీ ఛార్జర్ వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. లాంగ్ జర్నీలు చేసే వారికి, రోజంతా ఆఫీస్ కాల్స్‌లో బిజీగా ఉండేవారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో ఇంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ దొరకడం మార్కెట్లో దీనికి ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
మ్యూజిక్ లవర్సే కాకుండా.. మొబైల్ గేమర్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఇందులో అల్ట్రా-లో లేటెన్సీ ఫీచర్‌ను వాడారు. సాధారణంగా గేమింగ్ లవర్స్ ఆడియోకు, వీడియోకు మధ్య చిన్నపాటి ఆలస్యం జరుగుతుంటుంది. కానీ కేవలం 40ms లేటెన్సీ ఉండటం వల్ల గన్ షాట్స్, అడుగుల చప్పుళ్లు చాలా వేగంగా, కచ్చితంగా వినిపిస్తాయి. దీనివల్ల బాటిల్ రాయ్ గేమ్స్ ఆడేటప్పుడు శత్రువుల జాడను ఇట్టే పసిగట్టొచ్చు. ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్ గేమింగ్ ఫీల్ పొందాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్.
Also Read: రూ.699కే..60 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్‌బడ్స్! మార్కెట్‌లో కొత్త మోడల్
చెవులకు పర్ఫెక్ట్ సరిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. వర్కౌట్లు చేసేటప్పుడు.. లేదా జిమ్ చేసేటప్పుడు ఇవి చెవుల నుంచి జారిపడిపోవు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌టాప్‌తో ఇవి క్షణాల్లో పెయిర్ అవుతాయి. సిగ్నల్ కట్ అయ్యే సమస్యలు లేకుండా స్ట్రాంగ్ కనెక్షన్‌ను ఇస్తాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా ఫోన్ తీయకుండానే వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, కాల్స్ లిఫ్ట్ చేయడం వంటి పనులను ఈజీగా చేసుకోవవచ్చు.
రూ.2,099 బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, బెస్ట్ OWS టెక్నాలజీ, 65 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్ , గేమింగ్ కోసం లో లేటెన్సీ కోరుకునే.. వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.