E-Paper
Advertisement

బోస్ సౌండ్‌తో నోయిస్ ప్రీమియం ఇయర్‌ఫోన్స్.. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

బోస్ సౌండ్‌తో నోయిస్ ప్రీమియం ఇయర్‌ఫోన్స్.. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!
Advertisement

Noise Master Buds Open: ప్రముఖ ఆడియో బ్రాండ్ నోయిస్ నుంచి సరికొత్త ఆడియో ప్రొడక్ట్‌ను బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ 2026 ఈవెంట్‌లో ఘనంగా లాంచ్ చేసింది. మాస్టర్ బడ్స్ ఓపెన్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఓపెన్ ఇయర్ ఇయర్‌ఫోన్స్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తమ ప్రీమియం లైనప్‌ను మరింత విస్తరిస్తూ నోయిస్ ఈ సరికొత్త ఇయర్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది.

సౌండ్ బై బోస్ కాంబినేషన్:

ఈ కొత్త ఇయర్‌ఫోన్స్‌లో అత్యంత ప్రధానమైన విశేషం ‘సౌండ్ బై బోస్’ టెక్నాలజీ. ప్రముఖ గ్లోబల్ ఆడియో బ్రాండ్ బోస్ భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు. పాటలు వింటున్నప్పుడు అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందించడమే కాకుండా.. మాటలు చాలా స్పష్టంగా వినిపించేలా ఈ సాంకేతికత తోడ్పడుతుంది.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులు వాడేయొచ్చు.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేని కొత్త Luna Band సేల్స్ స్టార్ట్!

ఓపెన్ ఇయర్ ప్రత్యేకతలు:

ఇవి ఓపెన్ ఇయర్ డిజైన్‌తో రావడం వల్ల చెవులకు పూర్తి బంధనం లేకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. సంగీతం వింటూనే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

డిజైన్, లుక్ అండ్ ఫీల్:

Advertisement

డిజైన్ పరంగా ఇవి చాలా ప్రీమియం లుక్‌లో కనిపిస్తాయి. బ్లాక్, బ్రాంజ్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో వీటిని ప్రదర్శించారు. ఇయర్‌బడ్స్ పైభాగంలో మెటాలిక్ ఫినిషింగ్, నోయిస్‌తో పాటు సౌండ్ బై బోస్ అని రాసి ఉన్న లోగోలు వీటికి మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తున్నాయి.

భారత్‌లోకి ఎప్పుడంటే?

ఈ మాస్టర్ బడ్స్ ఓపెన్ ఇయర్‌ఫోన్స్ ఈ నెల ఆఖరు నాటికి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. నోయిస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రముఖ రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ధర వివరాలు కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

Also Read: మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

Tags

Related News

రూ.2400కే ఓవెన్ అంటే.. ఎవరైనా వదులుతారా ?

ఊహించనంత తక్కువ ధరకే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ !

ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం.. Airtel కస్టమర్లకు మాత్రమే ఈ ఛాన్స్!

సాధారణ ఇయర్‌బడ్స్‌కు గుడ్‌బై చెప్పండి.. ట్రెండీ లుక్‌‌తో అదరగొడుతున్న మోడల్

రూ.699కే..60 గంటల బ్యాటరీ బ్యాకప్‌ ఇయర్‌బడ్స్! మార్కెట్‌లోకి కొత్త మోడల్

సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులు వాడేయొచ్చు.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేని కొత్త Luna Band సేల్స్ స్టార్ట్!

పాత యాపిల్ వాచ్ ఇప్పుడు కొనొచ్చా? డబ్బులు పెట్టే ముందు ఈ 4 విషయాలు తెలుసుకోండి!

Big Stories

Advertisement
×