E-Paper
Advertisement

నెలనెలా రీఛార్జ్ తిప్పలు వద్దు బాబోయ్.. Jio, Airtel, Viలలో రూ.500 లోపే 84 రోజుల బెస్ట్ ప్లాన్స్ ఇవే!

నెలనెలా రీఛార్జ్ తిప్పలు వద్దు బాబోయ్.. Jio, Airtel, Viలలో రూ.500 లోపే 84 రోజుల బెస్ట్ ప్లాన్స్ ఇవే!
Advertisement

Best Prepaid Plans: దేశంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు మంచి ఉపశమనం కలిగించాయి. నెలనెలా రీఛార్జ్ చేసే తలనొప్పి లేకుండా, తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్ల కోసం చూసేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఎక్కువగా వాడుతూ, డేటా తక్కువగా కావాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు రూ.500 లోపే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తున్నాయి.

Airtel రూ.469 ప్లాన్:

ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ.469 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత కాల్స్‌తో పాటు మొత్తం 900 SMS లభిస్తాయి. డేటా వాడకం తక్కువగా ఉండే వారికి ఇది సరైన ఎంపిక. దీనితో పాటు హలోట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని రోజువారీ ఖర్చు కేవలం రూ.5.58 మాత్రమే పడుతుంది.

Jio రూ.448 ప్లాన్:

Advertisement

రిలయన్స్ జియో కూడా తమ యూజర్ల కోసం రూ.448 ధరతో ఒక పొదుపు ప్లాన్‌ను తెచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో ఉచిత అపరిమిత కాల్స్, 1000 SMS లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా మొబైల్ డేటా లభించనప్పటికీ.. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా వాడుకోవచ్చు. దీని రోజువారీ ఖర్చు దాదాపు రూ.5.33గా ఉంటుంది.

Vi రూ.470 ప్లాన్:

వోడాఫోన్ ఐడియా (వీఐ) కూడా తక్కువ బడ్జెట్‌లో రూ.470 ప్లాన్‌ను అందిస్తోంది. దీని ద్వారా 84 రోజుల పాటు ఉచిత కాల్స్, 900 SMS పొందొచ్చు. ఇంటర్నెట్ పెద్దగా అవసరం లేని వారికి, కేవలం ఫోన్ మాట్లాడటానికి మాత్రమే మొబైల్ వాడేవారికి ఈ ప్లాన్ ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీని రోజువారీ ఖర్చు సుమారు రూ.5.59 అవుతుంది.

డేటా కావాలనుకుంటే?

Advertisement

కొద్దిగా డేటా కూడా కావాలనుకునే వారి కోసం Vi రూ.548 ప్లాన్‌ను అందిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు ఇందులో 7GB డేటా, అపరిమిత కాల్స్, 1000 SMSలు వస్తాయి. అలాగే రూ.489 ధరతో 78 రోజుల వ్యాలిడిటీ, 6GB డేటా ఇచ్చే మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×