E-Paper
Advertisement

AI Chatbot: కృత్రిమ స్నేహాలు ప్రమాదకరమా? ఈ 5 తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!

AI Chatbot: కృత్రిమ స్నేహాలు ప్రమాదకరమా? ఈ 5 తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
Advertisement

AI Chatbot: కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్‌బాట్లు ముఖ్యంగా ChatGPT వంటి టూల్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. మెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం నుంచి ఏ చిన్న సందేహం వచ్చినా చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నాం. దీనికి తోడు AI మనిషిలా స్పందించే విధానం వల్ల చాలామంది ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ ఇక్కడే చిన్న జాగ్రత్త అవసరం. ఈ నమ్మకం కొన్నిసార్లు మనకే సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌బాట్లతో అవసరానికి మించి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే, ప్రైవసీకి ముప్పు, డేటా లీక్, ఐడెంటిటీ మిస్‌యూజ్ వంటి ప్రమాదాలు ఎదురవుతాయని చెబుతున్నారు. అందుకే ఈ కింది ఐదు విషయాలను AIతో అస్సలు పంచుకోవద్దు.

పాస్‌వర్డ్స్ & ఆర్థిక లావాదేవీలు:

ఏఐ చాట్‌బాట్లకు మీ లాగిన్ పాస్‌వర్డ్స్ చెప్పడం చాలా ప్రమాదం. ఇలా చేస్తే ఈ-మెయిల్, బ్యాంక్, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే.. సురక్షితమైన పాస్‌వర్డ్ మేనేజర్లు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు, ఆధార్ లాంటి ప్రభుత్వ ఐడీలను AI టూల్స్‌తో పంచుకోవడం చాలా ప్రమాదకరం. ఈ సమాచారం బయటకు వెళితే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీ ఆర్థిక వివరాలను సురక్షితమైన మార్గాల్లో మాత్రమే షేర్ చేసుకోవాలి.

వ్యక్తిగత డాక్యుమెంట్లు & ఆఫీస్ సీక్రెట్స్:

Advertisement

ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు లేదా ప్రైవేట్ ఫొటోలను ఏఐ చాట్‌బాట్లలో అప్లోడ్ చేయకపోవడమే మంచిది. మీరు హిస్టరీ డిలీట్ చేసినా.. డిజిటల్ గుర్తులు మిగిలి ఉండే అవకాశముంది. ఇవి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన అంతర్గత సమాచారం, కంపెనీ ప్లాన్స్, రిపోర్ట్స్, బిజినెస్ సీక్రెట్స్ వంటివి AI టూల్స్‌తో పంచుకుంటే డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది కంపెనీకి మాత్రమే కాదు.. మీ కెరీర్‌కూ ఇబ్బందిగా మారవచ్చు.

చట్టపరమైన వ్యవహారాలు & హెల్త్ రిపోర్ట్స్:

కాంట్రాక్టులు, కోర్టు కేసులు, వ్యక్తిగత వివాదాల వివరాలను చాట్‌బాట్లతో చర్చించడం అస్సలు సురక్షితం కాదు. ఈ సమాచారం బయటపడితే.. మీ కేసుపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అంతేకాదు, AI ఇచ్చే లీగల్ సలహా పూర్తిగా నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. దీంతోపాటు మీ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు లేదా చికిత్స వివరాలను కూడా AIతో పంచుకోవద్దు. ఇవి చాలా సున్నితమైన అంశం కాబట్టి.. తర్వాత మీరే బాధ పడాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యలు సలహానే ఉత్తమ మార్గం.

వ్యక్తిగత వివరాలు & భావోద్వేగ సమస్యలు:

Advertisement

పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలు ఒక్కొక్కటి చిన్నవిగా అనిపించినా, ఇవన్నీ కలిస్తే మీ పూర్తి వ్యక్తిగత ప్రొఫైల్ తయారవుతుంది. దీనివల్ల సైబర్ క్రైమ్‌లు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే చాట్‌బాట్లతో ఎమోషన్నల్‌గా కనెక్ట్ అవుతున్నారు చాలామంది. ఇది అంత మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఏఐను ఓ థెరపిస్టులా భావించి మీ వ్యక్తిగత సమస్యలు, రహస్యాలను చెప్పడం కూడా మంచిది కాదు. ఇవి గోప్యంగా ఉంటుందని నమ్మకం లేదు.

ప్రైవేట్ హాబిట్స్ & అనుచిత కంటెంట్:

ఎవరికీ చెప్పకూడదనుకునే వ్యక్తిగత అలవాట్లు లేదా ప్రైవేట్ విషయాలను AIతో పంచుకోవడం డేటా రికార్డ్ అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఇవే సమస్యగా మారవచ్చు. అలాగే అశ్లీలం, అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా చట్టవిరుద్ధ విషయాలను షేర్ చేయడం కూడా ప్రమాదకరం. ఇవి అకౌంట్ సస్పెన్షన్‌కు లేదా చట్టపరమైన చిక్కులకు దారి తీసే అవకాశం ఉంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×