E-Paper
Advertisement

Cheapest Electric Cars: ఎంజీ TO టాటా.. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Cheapest Electric Cars: ఎంజీ TO టాటా.. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Cheapest Electric Cars 2025: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అడుగు పెడుతున్నాయి. వీటిలో ఖరీదైన లగ్జరీ కార్ల నుంచి మొదలుకొని చౌకైన ఎలక్ట్రిక్ కార్ల వరకు అందుబాటులోకి వచ్చాయి. 2025 డిసెంబర్ నాటికి అందుబాటులో రేట్ల ప్రకారం దేశీయ మార్కెట్లో ఉన్న చౌకైన ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని మైక్రో/కాంపాక్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి.

ఇండియాలో చౌకైన ఎలక్ట్రిక్ కార్లు

⦿ MG Comet EV: రూ. 6.66 లక్షల నుంచి..

MG కామెట్ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ఇండియాలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతుంది. ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు ఉండగా.. హైఎండ్ ధర రూ.9.99 లక్షలుగా కొనసాగుతోంది. ఇది చిన్న కాంపాక్ట్ సిటీ కార్. ఒక్క ఛార్జ్ తో 230 km రేంజ్ లభిస్తుంది. 17.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. డ్యూయల్ 10.25 ఇంచ్ స్క్రీన్స్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ ప్లే, రివర్స్ కెమెరా, పవర్ ఫోల్డింగ్ ORVMs, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, ABS+EBDను కలిగి ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌కి పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు.

⦿ Tata Tiago EV: రూ. 7.99 లక్షల నుంచి..

Advertisement

టాటా ఎలక్ట్రిక్ కార్లలో టియాగో ఈవీ లోకాస్ట్ కారు. ప్రారంభ ధర 7.99 లక్షలు కాగా, హైఎండ్ ధర రూ. 11.89 లక్షలు.  పాపులర్ హ్యాచ్‌ బ్యాక్ అయిన ఈ కారు ఒక్క ఛార్జ్ తో 250-315 km రేంజ్ వస్తుంది. 19.2/24 kWh బ్యాటరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 7-ఇంచ్ టచ్‌ స్క్రీన్, క్రూజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో AC, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, రిజెనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్యామిలీ యూజ్‌కి బెస్ట్ గా చెప్పుకోవచ్చు.

⦿ Tata Punch EV: రూ. 9.99 లక్షల నుంచి..

టాటా నుంచి మరో చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీ. దీని ప్రారంభ ధర రూజ 9.99 లక్షలు కాగా, హైఎండ్ ధర రూ.14.49 లక్షలు. ఇది మైక్రో SUV. ఒక్క ఛార్జ్ తో 315-421 km రేంజ్ లభిస్తుంది. 25/35 kWh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్స్, 360° కెమెరా, సన్‌ రూఫ్ (టాప్ వేరియంట్స్), 6 ఎయిర్‌ బ్యాగ్స్, క్రూజ్ కంట్రోల్, V2L సపోర్ట్, 5 స్టార్ సేఫ్టీ లాంటి ఫీచర్లు ఉంటాయి. రఫ్ రోడ్స్‌ కి గుడ్.

⦿ Citroen eC3: రూ. 12.90 లక్షల నుంచి..

Advertisement

మరో చౌకైన ఎలక్ట్రిక్ కారు Citroen eC3. రూ. 12.90 లక్షల నుంచి రూ.13.53 లక్షలు ఉంటుంది. స్టైలిష్ హ్యాచ్‌ బ్యాక్. ఒక్క ఛార్జ్ తో 320 km రేంజ్ ను కలిగి ఉంటుంది. 29.2 kWh బ్యాటరీతో వస్తుంది. 10.2-ఇంచ్ టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ కనెక్టివిటీ, డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, DC ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. కంఫర్టబుల్ రైడ్ లభిస్తుంది.

⦿Tata Tigor EV: రూ. 12.49 లక్షల నుంచి..

టాటాకు సంబంధించి ఇంకో చౌకైన కారు Tata Tigor EV. రూ. 12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల వరకు ధర కలిగి ఉంటుంది. అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ సెడాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క ఛార్జ్ తో 315 km రేంజ్ ను కలిగి ఉంటుంది. బూట్ స్పేస్, క్రూజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, రిజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.  ఫ్యామిలీ సెడాన్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×