E-Paper
Advertisement

AI Glasses Privacy: మనిషిని చూడగానే పేరు, ఉద్యోగం, అడ్రస్ చెప్పేస్తున్న ఏఐ గ్లాసెస్.. ప్రమాదంలో ప్రైవెసీ..

AI Glasses Privacy: మనిషిని చూడగానే పేరు, ఉద్యోగం, అడ్రస్ చెప్పేస్తున్న ఏఐ గ్లాసెస్.. ప్రమాదంలో ప్రైవెసీ..
Advertisement

AI Glasses Privacy Concern Viral Video | ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో AI గ్లాసెస్ ధరించిన ఒక వ్యక్తి రోడ్డుపై నడుస్తున్న వాళ్లను చూసిన వెంటనే వారి పేరు, ఉద్యోగం, చదువు, అడ్రస్, అన్ని వివరాలను తన ఏఐ కళ్లజోడు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ చూసి అందరూ ఆశ్చర్యపోతూనే.. ఇది ప్రమాదకరమని భయపడుతున్నారు.

ఈ గ్లాసెస్ ఎలా పని చేస్తాయి?

డచ్ జర్నలిస్ట్ అలెగ్జాండర్ క్లోపింగ్ ఈ గ్లాసెస్ ధరించి డెమో వీడియో చూపించాడు. రోడ్డుపై నడిచే వాళ్ల ముఖాన్ని ఆ గ్లాసెస్ ద్వారా చూడగానే.. ఏఐ గ్లాసెస్ ఎదుటి వ్యక్తిని స్కాన్ చేస్తాయి. ఇంటర్నెట్‌లో నుంచి లింక్‌డ్ ఇన్, ఫేస్‌బుక్, ఇతర ప్రొఫైల్స్ నుంచి డేటా తీసుకొస్తాయి. క్షణాల్లో ఆ వ్యక్తి పేరు, అతను/ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు, అతని విద్యార్హత.. అన్నీ గ్లాస్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

సమాచారం కోసం ప్రభుత్వ డేటా, పోలీసుల అవసరం లేదు

Advertisement

ఈ గ్లాసెస్‌కు ఏ ప్రభుత్వ డేటాబేస్ అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు. ఈ గ్లాసెస్ కొనుగోలు చేసి ఎవరి గురించైనా సమాచారం తెలుసుకోవచ్చు. అంటే ఈ టెక్నాలజీ ఎవరి చేతికైనా వెళ్తే ఎవరైనా.. ఎవరి గురించైనా తెలుసుకోగలరు.

ప్రైవసీ ప్రమాదం గురించి హెచ్చరిస్తున్న నిపుణులు

AI ప్రైవసీ ఎక్స్‌పర్ట్ పాస్కల్ బోరోనెట్ ఈ వీడియో చూసి షాక్ అయ్యాడు. “ఇకపై బయట ఎవరూ అనామకంగా ఉండలేరు. తమ గుర్తింపుని దాచలేదరు. ఎవరినైనా చూస్తే చాలు వాళ్ల గురించి పూర్తి సమాచారం తెలిసిపోతుంది. ఇది ప్రజల ప్రైవసీని పూర్తిగా చంపేస్తుంది” అని హెచ్చరించాడు.

రోడ్డుపై ఎవరూ గుర్తు తెలియకుండా ఉండలేరు

Advertisement

ఈ గ్లాసెస్ వచ్చాక బయట నడిచే ప్రతి వ్యక్తి ఎవరికైనా “ఓపెన్ బుక్” లాగా మారుతాడు. ఎవరైనా మిమ్మల్ని చూసి మీ పేరు, ఇల్లు, ఉద్యోగం – అన్నీ తెలుసుకోగలరు. అంటే ప్రతి ఒక్కరూ ఈ గ్లాసెస్ ధరించి ఒక చిన్న గూఢాచారిగా మారిపోవచ్చు.

టెక్నాలజీ చాలా ప్రమాదకరం

ఈ గ్లాసెస్ ముఖాలను స్కాన్ చేసి డేటా సేవ్ చేసుకుంటాయి. ఒకవేళ ఈ డేటా హ్యాక్ అయితే ఎవరి భద్రతా ప్రమాదంలో పడవచ్చు. స్టాకర్స్, దొంగలు ఈ గ్లాసెస్ వాడితే చాలా ఇబ్బంది.

ఏఐ గ్లాసెస్ ని మంచి కోసం ఎలా ఉపయోగించాలి

మీరు ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి గురించి సమాచారం మర్చిపోతే.. లేక మీ వద్ద లేకపోతే.. తక్షణం వారి గురించి సెకండ్ల వ్యవధిలో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పార్టీలో, మీటింగ్‌లో ఎవరి పేరు మర్చిపోయినా సమస్య లేదు, గ్లాసెస్ చూస్తే తెలిసిపోతుంది. నెట్‌వర్కింగ్ చాలా సులభం అవుతుంది.

ఏఐ గ్లాసెస్ పై పెద్ద ప్రశ్న

ఈ టెక్నాలజీ ప్రజలకు మేలు చేస్తుందా? లేక హాని చేస్తుందా? అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ప్రైవసీ లేకుండా జీవించడాన్ని ప్రజలు ఒప్పుకుంటారా? లేక ఈ గ్లాసెస్‌ పై నిషేధం విధిస్తారా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. మరి మీ అభిప్రాయం ఏంటి?

Also Read: పిల్లల కోసం స్పెషల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త ఫోన్‌లో ఫీచర్స్ ఇవే..

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×