E-Paper
Advertisement

AI Beats Hackers: మానవ హ్యాకర్లను ఓడించిన ఏఐ.. సైబర్ సెక్యూరిటీ పరీక్షలో స్పూపర్ స్పీడ్

AI Beats Hackers: మానవ హ్యాకర్లను ఓడించిన ఏఐ.. సైబర్ సెక్యూరిటీ పరీక్షలో స్పూపర్ స్పీడ్
Advertisement

AI Beats Human Hackers| ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ AI) రాజ్యమేలుతోంది. మనుషులు ఊహకు అందని విధంగా ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి ఒక తాజా ఉదాహరణ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక సైబర్ సెక్యూరిటీ పరీక్ష.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల సైబర్‌ సెక్యూరిటీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో మానవులకు, AIకి కు మధ్య పోటీ జరిగింది. ఈ ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఒక AI ఏజెంట్ ప్రొఫెషనల్ మానవ హ్యాకర్ల కంటే మెరుగ్గా పనిచేసింది. డిజిటల్ వ్యవస్థలను రక్షించడానికి సాధారణంగా అధిక వేతనాలు తీసుకునే ఈ నిపుణులను AI సులభంగా అధిగమించింది. ఈ ఫలితం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది.

ARTEMIS ఏఐ సూపర్ స్పీడ్ పర్‌ఫామెన్స్

Advertisement

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన AI ఏజెంట్ ఆర్టెమిస్ ఒక యూనివర్సిటీ నెట్‌వర్క్‌లో 8,000కి పైగా డివైస్‌లను స్కాన్ చేసింది. ఇది కేవలం 16 గంటల్లోనే పూర్తి చేసింది. ఈ పరీక్షలో ఆర్టెమిస్ ఏఐ.. 10 మంది అనుభవజ్ఞులైన మానవ హ్యాకర్లు (పెనెట్రేషన్ టెస్టర్ల)లో 9 మందిని మించిపోయింది. మానవులు గుర్తించని కీలక సెక్యూరిటీ లోపాలను AI కనుగొంది. ఇది సైబర్ సెక్యూరిటీలో చాలా పెద్ద మార్పు.

ఆర్టెమిస్ ఎలా పని చేసింది?

ఆర్టెమిస్ సాధారణ AI టూల్స్ లాగా కాదు. ఇది ఆటోమెటిక్‌గా పనిచేసేఒక కాంప్లెక్స్, మల్టీ-స్టెప్ టాస్క్‌లు చేస్తుంది. ఏదైనా అనుమానాస్పద క్లూ దొరికితే బహుళ “సబ్-ఏజెంట్స్”ని లాంచ్ చేస్తుంది. ఈ సబ్-ఏజెంట్స్ ఒకేసారి వేర్వేరు కోణాల నుంచి లోపాలను పరిశీలిస్తాయి. మానవులు ఇలా ఒకేసారి అనేక లోపాలను చెక్ చేయలేరు.

మానవ, ఏఐ హ్యకింగ్ మధ్య ఖర్చు తేడా ఎంత

Advertisement

AI, మానవుల మధ్య సైబర్ సెక్యూరిటీ నిర్వహణ ఖర్చు తేడా భారీగా ఉంది. గంటకి పనిచేసేందుకు ఆర్టెమిస్ 18 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,500) మాత్రమే ఖర్చు అవుతుంది. అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఖర్చు గంటకు 59 డాలర్లు (రూ.5,000). అమెరికాలో ప్రొఫెషనల్ పెనెట్రేషన్ టెస్టర్ ఏటా 125,000 డాలర్లు (రూ.1 కోటి పైగా) సంపాదిస్తాడు. AI నిరంతరం, స్కేలబుల్‌గా పని చేస్తుంది. అంటే ఖర్చు చాలా తక్కువ.

మానవులు మిస్ చేసినవి AI ఎలా కనుగొంది?

ఒక పాత సర్వర్‌లో పెద్ద లోపం ఉంది. మానవ టెస్టర్ల బ్రౌజర్ లోడ్ కాలేదు కాబట్టి వాళ్లు మిస్ చేశారు. ARTEMIS కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ ద్వారా యాక్సెస్ చేసి లోపాన్ని కనుగొంది. గ్రాఫికల్ లిమిటేషన్స్ లేకుండా పట్టుబట్టి చెక్ చేసింది.

Also Read: ఎయిర్‌టెల్ vs జియో.. రీచార్జ్ ఫ్లాన్స్‌, స్పీడ్, నెట్‌వర్క్ పరంగా ఏది బెస్ట్?

పూర్తి స్థాయిలో రెడీ కాని ఆర్టెమిస్

ఆర్టెమిస్ ఏఐ ఇంకా 100 శాతం సిద్ధం కాలేదు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) టాస్క్‌లలో ఇబ్బంది పడుతుంది. ఒక సీరియస్ లోపాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయలేకపోయింది. క్లిక్ లేదా విజువల్ ఎలిమెంట్స్ సరిగ్గా గుర్తించలేదు. కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ కూడా వచ్చాయి.

సైబర్ సెక్యూరిటీ భవిష్యత్తు ఏమిటి?

ఈ పరీక్ష సైబర్ సెక్యూరిటీలో పెద్ద మార్పు సూచిస్తుంది. ఆర్టెమిస్ లాంటి AI మానవ సెక్యూరిటీ టీమ్‌లకి బలమైన సహాయం చేస్తుంది. పెద్ద నెట్‌వర్క్‌లను నిరంతరం స్కాన్ చేస్తుంది. అప్పుడు మానవులు కాంప్లెక్స్ స్ట్రాటజీల మీద ఫోకస్ చేయొచ్చు. AI వేగానికి తోడు మానవ ఆలోచన కలిసి భవిష్యత్ సైబర్ డిఫెన్స్‌ని నిర్ణయిస్తాయి

 

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×