E-Paper
Advertisement

IPL Auction-2026: ఐపీఎల్-2026 వేలం.. తెలుగు అబ్బాయి అమన్‌రావుకి జాక్‌పాట్, ఆర్ఆర్‌లో చోటు

IPL Auction-2026: ఐపీఎల్-2026 వేలం.. తెలుగు అబ్బాయి అమన్‌రావుకి జాక్‌పాట్, ఆర్ఆర్‌లో చోటు
Advertisement

IPL Auction-2026: యువ క్రికెటర్లకు ఆశాకిరణం ఐపీఎల్ టోర్నీ. అందులో ఒక్కసారి సెలక్టయితే తమ కెరీర్‌కు తిరుగు ఉండదని చాలామంది ఆటగాళ్లు భావిస్తుంటారు. గంటల తరబడి మైదానంలోనే ప్రాక్టీసు చేస్తుంటారు. వారి ఆట, శ్వాస అంతా క్రికెట్ పైనే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ వేలంలో తెలుగు అబ్బాయి అమన్‌రావుకి ఛాన్స్ వరించింది.అతడ్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది.

ఐపీఎల్-2026 వేలం.. తెలుగు అబ్బాయికి ఛాన్స్

Advertisement

క్రికెట్.. ఈ పేరు గురించి చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఈ క్రీడకున్న ప్రాముఖ్యత దేనికీ లేదు. ఒక్కసారి క్లిక్కయితే జీవితం సెటిల్, ఆపై సెలబ్రిటీ హోదా. జీవితంలో ఒక్కసారైనా టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రతీ క్రీడాకారుడు కలలు గంటారు. అది కొందరికే సాధ్యం అవుతుంది. ఐపీఎల్ పుణ్యమాని కొత్తకొత్త వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

మంగళవారం దుబాయ్ వేదికగా ఐపీఎల్-2026 వేలం జరిగింది. ఈసారి ఐపీఎల్‌ వేలంలో పెద్ద ప్లేయర్స్‌ని కొనుగోలు చేసేందుకు పలు టీమ్‌లు ఆసక్తి చూపలేదు. కేవలం యంగ్ ప్లేయర్స్‌పై దృష్టి సారించాయి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఆటగాడికి ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ వచ్చింది.

Advertisement

 అమన్‌రావు దక్కించుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు

21 ఏళ్ల పేరాల అమన్‌రావుని ఐపీఎల్ వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు. ప్రస్తుతం అమన్.. హైదరాబాద్‌ జట్టు తరఫున అండర్‌-23 ఆటగాడు. రంజీ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కొద్దిరోజుల కిందట ముస్తాక్‌ అలీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.

టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ కూడా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో అమన్‌రావుకు అదృష్టం వరించింది. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం. అతడికి పాస్‌పోర్టు లేకపోవడంతో కేంద్రమంత్రి బండి సంజయ్ తక్షణమే పాస్‌పోర్టు జారీ చేయించారు.

ALSO READ: ఐపీఎల్-2026 వేలం తర్వాత 10 జట్ల ఫ్లేయర్ల లిస్టు ఇదే

కొన్నేళ్లుగా అమన్‌రావు కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. అమన్‌రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు. కరీంనగర్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ ఆడారు ఆయన. యువ క్రీడాకారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్‌ సునీల్‌రావులు హర్షం వ్యక్తం చేశారు.

 

IPL Auction-2026: ఐపీఎల్-2026 వేలం.. తెలుగు అబ్బాయి అమన్‌రావుకి జాక్‌పాట్

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×