E-Paper
Advertisement

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!
Advertisement

Normal Phone vs AI Phone: స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. ఒకప్పుడు ఫోన్ కొనాలంటే కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు AI (Artificial Intelligence) ఫీచర్లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఫోటో ఎడిటింగ్, వాయిస్ కమాండ్స్, టెక్స్ట్ రైటింగ్, ఇతర పనులను సులభంగా చేయడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అయితే సాధారణ ఫోన్‌కు, ఏఐ ఫోన్‌కు మధ్య అసలు తేడా ఏమిటి? ఈ ఫీచర్లు మన రోజువారీ జీవితంలో నిజంగా ఎంతవరకు ఉపయోగపడతాయి? కేవలం ఏఐ పేరుతో ఫోన్ల ధరలు పెంచుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోవడంతో పాటు, ఏఐ ఫోన్ కొనడం ఎంతవరకు సరైన నిర్ణయమో ఇప్పుడు చూద్దాం.

ఫోటోల ఎడిటింగ్ సులభం..

సాధారణ ఫోన్‌లో మనం ఒక ఫోటో తీస్తే అది అలాగే ఉంటుంది. అందులో ఏదైనా వాటర్ మార్క్స్ గానీ లేదంటే బ్యాగ్రౌండ్ తొలగించడం చాలా కష్టం. కానీ ఏఐ ఫోన్లలో కెమెరా పనితీరు చాలా మారుతుంది. ఫోటోలో మనకు నచ్చని మనుషులను లేదా వస్తువులను సింగిల్ క్లిక్‌తో తొలగించవచ్చు. వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ను మన ఇష్టానికి మార్చుకోవచ్చు. దీనికోసం వేరే యాప్స్ అవసరం లేదు. ఫోన్లోని ఏఐ టూల్స్ అన్నీ క్షణాల్లో ఆ పని పూర్తి చేస్తాయి.

భాషల గోల ఉండదు..

Advertisement

మనం ఎవరితోనైనా వేరే భాషలో మాట్లాడుతున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సాధారణ ఫోన్లలో దీనికోసం గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేయాలి. కానీ ఏఐ ఫోన్లలో లైవ్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడే అవతలి వ్యక్తి మాట్లాడేది మన భాషలోకి మారుతుంది. మెసేజ్‌లు టైప్ చేసేటప్పుడు కూడా మన భావాలకు తగినట్లుగా వాక్యాలను అదే సరిచేస్తుంది. ఆఫీస్ పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది..

Advertisement

మనం రోజంతా ఫోన్ వాడినప్పుడు బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సాధారణ ఫోన్లు మనం వాడే యాప్స్‌ను బట్టి బ్యాటరీని ఖర్చు చేస్తాయి. కానీ ఏఐ ఫోన్లు మన అలవాట్లను గమనిస్తాయి. మనం ఏ సమయంలో ఏ యాప్ ఎక్కువగా వాడతామో గుర్తుపెట్టుకుని, మిగతా వాటికి బ్యాటరీ పవర్ ఆటోమేటిక్‌గా తగ్గిస్తాయి. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది.

పనులన్నీ వేగంగా జరుగుతాయి..

రోజూ చేసే పనులను గుర్తుపెట్టుకోవడం, షెడ్యూల్ చేసుకోవడం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఏఐ ఫోన్లు మన పనులను సులభం చేస్తాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేయాల్సిన పనులను అవే గుర్తు చేస్తాయి. వాయిస్ ద్వారా మనం చెప్పే చిన్నపాటి ఆదేశాలతో పెద్ద పెద్ద పనులను కూడా సెకన్లలో పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా కొన్ని పనులు సొంతంగా చేసుకునే శక్తి దీనికి ఉంటుంది.

ఏది కొనడం ఉత్తమం?

సాధారణ ఫోన్లతో పోలిస్తే.. ఏఐ ఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త టెక్నాలజీ కావడంతో కంపెనీలు భారీగా ధరలు నిర్ణయిస్తున్నాయి. మనకు నిజంగా ఆ ఫీచర్లు అవసరమా లేదా అనేది ఆలోచించుకోవాలి. కేవలం ఫోటోలు తీయడానికి, సాధారణ వాట్సప్ వాడకానికి అయితే సాధారణ ఫోన్లే చాలు. కానీ ఆఫీస్ పని ఎక్కువగా ఉండి, నిత్యం సాంకేతికతను వాడేవారికి మాత్రం ఏఐ ఫోన్లు మంచి ఎంపిక అవుతాయి.

Also Read: అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

Tags

Related News

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

Big Stories

Advertisement
×