Most Beautiful Train Journeys: రైలు ప్రయాణం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు. కిటికీ పక్కన కూర్చొని పచ్చని కొండలు, దట్టమైన అడవులు, అందమైన నదులు, జలపాతాలు, సముద్రపు అలలను చూస్తూ ప్రయాణించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి. దేశంలో ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను అందించే ఎన్నో రైల్వే మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలను అందించే 8 ప్రత్యేకమైన రైలు ప్రయాణాల గురించి తెలుసుకుందాం.
ఊటీకి వెళ్లే ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేది నీలగిరి పర్వత రైల్వే. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు సాగే ఈ రైలు ప్రయాణంలో పచ్చని కొండలు, సొరంగాలు, వంతెనలు కనువిందు చేస్తాయి. నెమ్మదిగా కొండలను ఎక్కుతూ వెళ్లే ఈ రైలు ప్రయాణం పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఈ రైల్వే యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది.
పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని జోగిందర్ నగర్ వరకు సాగే ఈ రైలు మార్గం సుమారు 164 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణమంతా ధౌలాధర్ పర్వత శ్రేణులు, నదులు, పచ్చని తేయాకు తోటలు ఆకట్టుకుంటాయి. ప్రకృతిని ప్రశాంతంగా ఆస్వాదించాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
టాయ్ ట్రైన్గా ప్రసిద్ధి చెందిన ఈ రైల్వే మార్గం చారిత్రక ప్రాధాన్యం కలిగినది. ఇరుకైన పట్టాలపై ప్రయాణించే రైలు, కొండ మలుపులు, తేయాకు తోటలు, మేఘాలతో కప్పుకున్న పర్వతాల మధ్య సాగుతుంది. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది.
మహారాష్ట్ర నుంచి గోవా మీదుగా కర్ణాటక వైపు సాగే కొంకణ్ రైల్వే మార్గం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వర్షాకాలంలో జలపాతాలు, పచ్చని లోయలు, కొండలు, పొడవైన సొరంగాలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.
ఈ రైలు ప్రయాణంలో వరి పొలాలు, రబ్బరు తోటలు, కొండలు, నదులు కనిపిస్తాయి. ముఖ్యంగా 13 ఆర్చ్ వంతెన ఈ మార్గానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతి అందాలతో పాటు చారిత్రక నిర్మాణాలను కూడా చూడాలనుకునేవారికి ఈ ప్రయాణం నచ్చుతుంది.
చిలికా సరస్సు సమీపంగా సాగే రైలు ప్రయాణం నీలి నీళ్లు, పచ్చని కొండల అందాలను పరిచయం చేస్తుంది. ఈ ప్రాంతంలో స్థానిక, వలస పక్షులను చూడవచ్చు. ఈ సరస్సులో ఇరావడి డాల్ఫిన్లు కూడా కనిపిస్తాయి.
విలాసవంతమైన రైలు ప్రయాణాన్ని కోరుకునేవారికి ప్యాలెస్ ఆన్ వీల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. రాజభవనాలను తలపించే కోచ్లు, రాజస్థానీ వంటకాలు, ప్రత్యేకమైన ఆతిథ్యం ఈ రైలులో ప్రత్యేకతలు.
సముద్రం మధ్యలో నిర్మించిన పాంబన్ వంతెన మీదుగా సాగే రైలు ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. చుట్టూ నీలి సముద్రం, తీరప్రాంత గ్రామాలు, అందమైన బీచ్లు కనిపిస్తాయి. రామేశ్వరం చేరుకునే ఈ ప్రయాణం ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా అందిస్తుంది.
Read Also: కోడైకనాల్ టూర్కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!