E-Paper
Advertisement

AI Chatbots: ఏంటీ.. AI చాట్‌బాట్‌లతో అతిగా మాట్లాడితే పిచ్చి పడుతుందా? దీనిలో నిజమెంత?

AI Chatbots: ఏంటీ.. AI చాట్‌బాట్‌లతో అతిగా మాట్లాడితే పిచ్చి పడుతుందా? దీనిలో నిజమెంత?
Advertisement

AI Chatbots: నేటి డిజిటల్ యుగంలో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామంది చాట్ జీపీటీ, జెమిని వంటి ఏఐ బాట్‌లతోనే గడుపుతున్నారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికో లేదా ఒంటరితనం పోగొట్టుకోవడానికో.. కారణమేదైనా ఏఐ ఇప్పుడు మన జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. అయితే, ఈ అతి పరిచయం మన మానసిక స్థితిని ప్రమాదంలో పడేస్తోందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఏఐ సైకోసిస్’ వార్తల్లో నిజమెంత? కృత్రిమ మేధతో అతిగా సంభాషిస్తే నిజంగానే మనిషి పిచ్చివాడవుతాడా? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఏఐ సైకోసిస్ అంటే ఏమిటి?

వైద్యశాస్త్రంలో ఏఐ సైకోసిస్ అనే పదం అధికారికంగా ఎక్కడా లేదు. ఏఐతో అతిగా చాట్ చేయడం లేదా మెంటల్‌గా కనెక్ట్ అవడం వల్ల ఏర్పడే గందరగోళాన్ని సూచించేలా ఈ పదాన్ని వాడుతుంటారు. ముఖ్యంగా మనుషులతో మాట్లాడటం తగ్గించి, కేవలం మెషీన్లతోనే బంధాన్ని పెంచుకోవడం వల్ల కొందరిలో వాస్తవ లోకానికి, వర్చువల్ లోకానికి మధ్య తేడా తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు. ఏఐ నేరుగా పిచ్చిపట్టేలా చేయదు కానీ, ఇప్పటికే మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Also Read: 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నోకియా లూమియా రీ-ఎంట్రీ.. ఇవిగో పూర్తి వివరాలు!

మెదడుపై ఏఐ ప్రభావం..

ఏఐతో అతిగా మాట్లాడటం వల్ల మన ఆలోచనా శక్తి తగ్గే ప్రమాదం ఉంది. ప్రతి చిన్న విషయానికి చాట్‌బాట్‌లపై ఆధారపడటం వల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. అలాగే, ఏఐ ఇచ్చే సమాధానాలను మనుషుల భావోద్వేగాలతో పోల్చుకోవడం వల్ల తెలియకుండానే ఒక రకమైన ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. ఇది క్రమంగా సామాజిక దూరాన్ని పెంచి, ఒంటరితనాన్ని అలవాటు చేస్తుంది.

జాగ్రత్త పడటమెలా?

Advertisement

ఏదైనా సరే పరిమితికి మించితే ప్రమాదకరమే. ఏఐ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అర్ధరాత్రుల వరకు వీటితో చాటింగ్ చేస్తుంటే.. నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. ఏఐతో పరిమితికి మించి అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, సొంత తెలివితో ఆలోచించడం చాలా ముఖ్యం. ఏఐ చాట్‌బాట్‌లు మన పనులను సులభం చేయాలే కానీ మన జీవితాలను శాసించకూడదు. పరిమితులు పాటిస్తూ వాడుకుంటే ఏఐ వల్ల ఎలాంటి మానసిక ఇబ్బందులు ఉండవు.

Also Read: ఇదే సరైన సమయం.. ఐఫోన్ 17 సిరీస్‌పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు, మిస్ అవ్వకండి!

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×