E-Paper
Advertisement

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు
Advertisement

Minister Vakiti Srihari:  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని అన్నారు.

Also Read: Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలి 

Advertisement

సమాజంలో ఐక్యత, సహనం, పరస్పర గౌరవం పెంపొందించడం ఈ పండుగ ప్రధాన సందేశమని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ, సమాజంలో సత్సంబంధాలు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రజలు పండుగను ప్రశాంతంగా, భద్రతా నియమాలు పాటిస్తూ జరుపుకోవాలని, దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. యువత మద్యం, అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని మంత్రి సూచించారు.

Also Read:  Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×