E-Paper
Advertisement

Air Fryer: మీ వంట గదిలో ఇది కూడా ఉంటే సగం గ్యాస్ కలిసొచ్చినట్లే.. ఆరోగ్యం కూడా..

Air Fryer: మీ వంట గదిలో ఇది కూడా ఉంటే సగం గ్యాస్ కలిసొచ్చినట్లే.. ఆరోగ్యం కూడా..
Advertisement

Air Fryer: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.. అయితే గ్యాస్ ఆదాచేసేందుకు ప్రజలు దాదాపు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండక్షన్ తో పాటు ఇంకో ఎలట్రిక్ డివైజ్ కూడా మీ ఇంట్లో ఉంటే వంట మరింత సులభం అంవుతుంది. అదే ఎయిర్ ఫైయర్ ఇది రూ. 3 వేల లోపు వచ్చేస్తుంది. మీ వంటను మరింత సులభంగా ఆరోగ్య వంతంగా తయారు చేస్తుంది. ఇందులో ఆయిల్ వాడకం కూడా బాగా తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ తరహాలోనే, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరమైన పరికరంగా మారింది.

Rwead also-YouTube No Ads: యూట్యూబ్‌ ధమాకా ఆఫర్.. యాడ్స్ లేకుండా 60 రోజుల వరకు వీడియోస్ ఫ్రీ.. ఇలా యాక్టివేట్ చేయండి

గ్యాస్ ఆదా

Advertisement

వంట గ్యాస్ కొరతను, పెరుగుతున్న ధరలను అధిగమించేందుకు ఇది చక్కని పరిష్కారం. పిండి వంటలు, వేపుళ్లు చేయడానికి గంటల తరబడి గ్యాస్ వాడాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా , డీప్ ఫ్రై చేసే పదార్థాలను కేవలం ఒక చెంచా నూనెతో లేదా అస్సలు నూనె లేకుండానే ఇందులో తయారు చేసుకోవచ్చు.

ఆరోగ్యం మీ చేతుల్లో

అధిక నూనె వాడకం వల్ల వచ్చే గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకు ఎయిర్ ఫ్రైయర్ చెక్ పెడుతుంది. ఇది వేడి గాలి ద్వారా ఆహారాన్ని ఉడికిస్తుంది. దీనివల్ల ఆహారంలోని కేలరీలు దాదాపు 70-80% వరకు తగ్గుతాయి. ఎయిర్ ఫ్రైయర్‌తో కేవలం ఫ్రై మాత్రమే కాదు, ఇంకా ఎన్నో చేయవచ్చు. కేకులు, బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. చికెన్, పనీర్ వంటి వాటిని రోస్ట్ చేయవచ్చు. మిగిలిపోయిన ఫుడ్ లేదా సమోసాలు వంటి వాటిని మళ్లీ క్రిస్పీగా వేడి చేసుకోవచ్చు. ఇప్పడు మీకు ఇష్టమైన ఆహారం ఏ చింతా లేకుండా తినవచ్చు.

Advertisement

Read also-Most Powerful Mixer Grinder: మీ పాత మిక్సీని పక్కన పడేయండి! ఈ ‘పవర్ హౌస్’ గ్రైండర్ల గురించి తెలుసా?

బడ్జెట్ ధరలో లభ్యత

ప్రస్తుతం మార్కెట్‌లో మంచి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్లు రూ. 3,000 నుండి రూ. 5,000 లోపు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఒకసారి పెట్టే పెట్టుబడి అయినప్పటికీ, దీర్ఘకాలంలో మీ గ్యాస్ బిల్లును, మెడికల్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

చిట్కాలు

ఎయిర్ ఫ్రైయర్ కొనేటప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి దాని కెపాసిటీ చూసి తీసుకోవాలి. వంట చేసేటప్పుడు మధ్యలో ఒకసారి బాస్కెట్‌ను తీసి పదార్థాలను అటు ఇటు కలిపితే వంట సమానంగా ఉడుకుతుంది. ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేస్తుంది, కాబట్టి కరెంట్ బిల్లు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×