E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ క్రేజీ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ హాట్‌స్టార్.. ఎన్నో మరెన్నో బెన్‌ఫిట్స్!

ఎయిర్‌టెల్ క్రేజీ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ హాట్‌స్టార్.. ఎన్నో మరెన్నో బెన్‌ఫిట్స్!
Advertisement

Airtel Plan: దేశంలోని దిగ్గజ టెలికాం రంగ సంస్థల్లో భారతీ ఎయిర్ టెల్ ఒకటి. అత్యంత నాణ్యమైన, వేగవంతమైన డేటాను అందించడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. దేశంలో రెండో అత్యధిక యూజర్లను కలిగిన నెట్ వర్క్ గా ఉన్న ఎయిర్ టెల్.. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తన యూజర్ల కోసం తెచ్చిన రూ.449 ప్లాన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించిన ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.449 ప్లాన్ ప్రయోజనాలు..

ప్రీమియం మంత్లీ ప్లాన్ లో భాగంగా ఎయిర్ టెల్.. దీనిని తీసుకొచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో.. యూజర్ కు అపరిమిత 5G డేటా లభిస్తుంది. వాస్తవానికి ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ డేటా అని చెబుతున్నప్పటికీ ప్లాన్ పూర్తి కాలానికి 300GB హై స్పీడ్ డేటా మాత్రమే యూజర్ పొందనున్నాడు. అలాగే ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలను సైతం ఈ ప్లాన్ కింద అందిస్తున్నారు.

ఫ్రీ ఓటీటీ సబ్‌స్కిప్షన్స్

Advertisement

ఎయిర్ టెల్ ఈ రూ.449 ప్లాన్ లో ఉచిత ఓటీటీ ప్రయోజనాలను సైతం అందిస్తోంది. 3 నెలల పాటు ఉచిత హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ (మెుబైల్) యూజర్ పొందవచ్చు. అలాగే ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే ప్రీమియం కంటెంట్ ను సైతం ఫ్రీగా వీక్షించవచ్చు. అలాగే గూగుల్ వన్ ద్వారా 100GB క్లౌడ్ స్టోరేజ్, ఆడోమ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం ఏడాది సబ్ స్క్రిప్షన్ లభించనుంది.

Also Read: టాటా EVలపై క్రేజీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.3 లక్షల డిస్కౌంట్!

ఎవరికి ప్రయోజనం అంటే?

Advertisement

నెలకు రూ.500 ఖర్చుతో మంచి ప్రీపెయిడ్ ప్లాన్ కోరుకునేవారికి.. రూ.449 రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. నెలకు అపరిమిత డేటా (300GB) డేటా లభిస్తున్నందున.. డేటా అయిపోతుందన్న భయం ఉండదు. అలాగే ఐపీఎల్ లవర్స్ కు సైతం ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్.. మ్యాచ్ లను వీక్షించేందుకు ఉపయోగపడుతుంది.

Also Read: ఈ వార్ బాక్సాఫీస్ వార్.. నిలదొక్కుకున్న ‘డెకాయిట్’.. ‘LIK’కి తప్పని తిప్పలు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×