E-Paper
Advertisement

టాటా EVలపై క్రేజీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.3 లక్షల డిస్కౌంట్!

టాటా EVలపై క్రేజీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.3 లక్షల డిస్కౌంట్!
Advertisement

Best Deals on Tata Electric Cars In April 2026: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ సత్తా చాటుతోంది. ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తూ టాప్ లో కొనసాగుతోంది. తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకనేందుకు ఏప్రిల్ 2026లో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. టాటా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ మోడళ్లపై  భారీ తగ్గింపులు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ ఆఫర్లు లాంటి ప్రయోజనాలను అందిస్తోదంఇ.

⦿ Tata Curvv EV

ఈ నెలలో ఎక్కువ లాభం పొందే మోడల్ టాటా కర్వ్ ఈవీ. ఇందులో ఎక్కువ వేరియంట్లపై రూ. 3 లక్షల వరకు బోనస్ అందిస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ కలిపితే మొత్తం ప్రయోజనం రూ. 3.3 లక్షల వరకు చేరుతుంది. ఈ SUV ధర సుమారు రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 22 లక్షలకు పైగా ఉంటుంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

⦿ Tata Punch EV

Advertisement

ఇక టాటా పంచ్ ఈవీ పాత స్టాక్‌ పై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డీలర్ల దగ్గర మిగిలి ఉన్న యూనిట్లపై రూ. 1.40 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ. 1.10 లక్షల బోనస్‌ తో పాటు రూ. 30,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లు లాంగ్ రేంజ్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి.

⦿ Tata Harrier EV

టాటా తన  ఫ్లాగ్‌షిప్ SUV అయిన ఈ మోడల్ పై మంచి ఆఫర్లతో వస్తోంది. మొత్తం రూ. 1.5 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 1 లక్ష క్యాష్  బోనస్, రూ. 50,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నాయి. ఈ కారు ధరలు సుమారు రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ రూ. 30 లక్షల వరకు ఉంటుంది.

⦿ Tata Tiago EV

Advertisement

బడ్జెట్ కస్టమర్ల కోసం టాటా టియాగ EV కూడా మంచి తగ్గింపులు అందిస్తోంది. ఈ మోడల్‌ పై రూ. 1.2 లక్షల వరకు బెనిఫిట్స్ ఇస్తోంది. అయితే, ఈ ఆఫర్ టాప్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేసింది. ఇందులో రూ. 1 లక్ష బోనస్‌తో పాటు రూ. 20,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

⦿ Tata Nexon EV

టాటా నెక్సాన్ ఈవీ మీద కూడా డిస్కౌంట్ ఇస్తోంది. ఈ మోడల్‌పై మొత్తం రూ. 50,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 20,000 బోనస్, రూ. 30,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నాయి. ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉంటాయి.  మొత్తంగా ఈ ఏప్రిల్ నెలలో టాటా ఎలక్ట్రిక్ కార్లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు  సిటీ, స్టాక్ లభ్యత ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.

Read Also: ఈవీ సెగ్మెంట్‌ లో మారుతి దూకుడు.. ఏకంగా నాలుగు కొత్త మోడల్స్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×