E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కేవలం రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. యూజర్లకు పండగే!

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కేవలం రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. యూజర్లకు పండగే!
Advertisement

Airtel 84 Days Plan: టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుండి మొబైల్ వినియోగదారులకు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సెకండరీ సిమ్ కార్డ్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం ప్రతి నెలా వందల రూపాయలు ఖర్చు పెట్టడం సామాన్యులకు పెద్ద భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ తమ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.500 లోపు బడ్జెట్‌లోనే ఏకంగా 84 రోజుల పాటు లాంగ్ వాలిడిటీని ఇచ్చే సరికొత్త వాయిస్-ఓన్లీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

కేవలం రూ.469 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్లు దాదాపు 3 నెలల పాటు సిమ్ యాక్టివేషన్ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. కేవలం వాలిడిటీ, కాలింగ్ మాత్రమే కావాలనుకునే వారికి, ముఖ్యంగా సెకండరీ సిమ్ వాడేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా లభించే పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

తక్కువ ధరలో ఎక్కువ లాభాలు:

Advertisement

ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌తో యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ తీసుకుంటే 84 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. బ్యాంకింగ్ ఓటీపీలు, మెసేజ్‌ల కోసం 900 ఉచిత ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు. అయితే, ఇది పూర్తిగా వాయిస్ కాలింగ్ కోసం తీసుకొచ్చిన ప్లాన్ కావడం వల్ల దీనిలో ఎలాంటి డేటా బెనిఫిట్స్ లభించవు. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ కావాలనుకుంటే, విడిగా డేటా ప్యాక్ వేసుకోవచ్చు.

Also Read: మీ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా.. సూపర్ స్పీడ్‌తో పనిచేసే బెస్ట్ బ్రౌజర్లు ఇవే!

అదనపు ఫీచర్లు కూడా:

Advertisement

ఈ ప్లాన్‌తో కేవలం కాలింగ్ మాత్రమే కాకుండా.. మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఎయిర్‌టెల్ ఇస్తోంది. దీనితో పాటు ఏడాది పాటు ఉచితంగా ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే ఉచిత హలో ట్యూన్స్, స్పామ్ కాల్స్ నుండి రక్షణ కల్పించే ప్రత్యేక నెట్‌వర్క్ ఫీచర్‌ను కూడా పొందొచ్చు.

డేటా కావాలనుకుంటే?

మీకు కాలింగ్‌తో పాటు ఇంటర్నెట్ కూడా కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.548 ప్లాన్‌ను పరిశీలించవచ్చు. దీని ద్వారా కూడా 84 రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 900 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కానీ, దీనితో పాటు అదనంగా 7GB హైస్పీడ్ డేటా కూడా వస్తుంది. యూపీఐ పేమెంట్లు, వాట్సప్ మెసేజ్‌ల కోసం ఇంటర్నెట్ వాడేవారికి ఇది సరిపోతుంది.

సెకండరీ సిమ్ యూజర్ల కోసమే:

ట్రాయ్ సూచనల మేరకు టెలికాం సంస్థలు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను అందిస్తున్నాయి. డ్యూయల్ సిమ్ వాడుతూ, పెద్దగా డేటా అవసరం లేని వారికి, కేవలం ఓటీపీలు వస్తే చాలనుకునే వారికి ఈ ప్లాన్లు చాలా హెల్ప్ అవుతాయి. మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాలనే తలనొప్పి లేకుండా.. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఇవి చక్కటి మార్గం.

Also Read: క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ పోగోట్టుకున్నారా? బ్యాంక్‌కు వెళ్లకుండానే నిమిషాల్లో బ్లాక్ చేయండిలా!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×