E-Paper
Advertisement

రూ.30 వేల ఏసీ ఎందుకు దండగ.. జస్ట్ రూ.800తో 45°C ఎండలోనూ ఇంటి వేడిని 15% తగ్గించుకోండి!

రూ.30 వేల ఏసీ ఎందుకు దండగ.. జస్ట్ రూ.800తో 45°C ఎండలోనూ ఇంటి వేడిని 15% తగ్గించుకోండి!
Advertisement

DIY Roof Cooling Trick: ప్రస్తుతం ఎండలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. భానుడి భగభగలకు తట్టుకోలేక జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు వేసినా నిప్పులు చెరుగుతున్నట్లు వేడిగాలి వస్తోంది. ఈ తరుణంలో ఏసీలు కొందామంటే వేలల్లో ఖర్చు, ఆ తర్వాత వచ్చే కరెంట్ బిల్లులు చూస్తే గుండె గుభేల్ అంటుంది. ఇలాంటి తరుణంలో ఒక సామాన్యుడు కనిపెట్టిన దేశీ జుగాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం రూ.800 ఖర్చుతో ఇంటి పైకప్పును చల్లబరిచి, గది ఉష్ణోగ్రతను ఏకంగా 15 డిగ్రీల వరకు తగ్గించవచ్చని అతడు నిరూపించాడు.

వైరల్ అవుతున్న క్రేజీ చిట్కా:

ఒక వ్యక్తి తన ఇంటి డాబాపై చేసిన ప్రయోగం ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఎండ తీవ్రత పెరిగినప్పుడు సిమెంట్ శ్లాబ్‌లు వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. దీనివల్ల రాత్రిపూట కూడా ఇళ్లు నిప్పుల కుంపటిలా మారుతాయి. దీనికి విరుగుడుగా సదరు వ్యక్తి ఒక సహజమైన, సైంటిఫిక్ పద్ధతిని ఉపయోగించాడు. ఏసీల కోసం వేలాది రూపాయలు తగలేసే కంటే, ఈ చిన్న చిట్కాతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చని అతడు వివరించాడు.

దీన్నెలా తయారు చేయాలి?

Advertisement

ఈ చౌకైన కూలింగ్ కోటింగ్ కోసం ఆ వ్యక్తి పెద్దగా శ్రమించలేదు. మనకు మార్కెట్లో సులువుగా దొరికే వస్తువులనే ఉపయోగించాడు. అందుకోసం తెల్లటి సున్నం (చూనా) పొడిని తీసుకుని నీళ్లలో బాగా కలిపాడు. ఆ మిశ్రమంలో డాక్టర్ ఫిక్సిట్ యుఆర్‌పి (Fixit URP), కొద్దిగా ఫెవికాల్ బైండర్‌ను జతచేశాడు. ఇవన్నీ కలిసి ఒక చిక్కటి తెల్లటి ద్రావణంగా మారేలా బాగా మిక్స్ చేశాడు.

Also Read: అద్భుత ఆవిష్కరణ.. 97% ఎండను తిప్పికొట్టే ‘స్మార్ట్ పెయింట్’.. ఇక ఏసీ అవసరం లేనట్టే!

డాబాకు పూతవేసే విధానం:

Advertisement

మిశ్రమం సిద్ధమైన తర్వాత.. మొదటగా డాబాపై ఉన్న దుమ్ము, ధూళిని పూర్తిగా తుడిచేసి శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత బ్రష్, రోలర్ సహాయంతో ఈ తెల్లటి మిశ్రమాన్ని పైకప్పు అంతటా సమానంగా పూశాడు. మెరుగైన ఫలితాల కోసం ఒక లేయర్ ఎండిన తర్వాత మరో లేయర్ వేయడం మంచిదని అతడు సూచించాడు. ఈ పూత మొత్తం ఎండలో పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక రక్షణ కవచంలా మారిపోతుంది.

దీని వెనకున్న అసలు సైన్స్:

తెల్లటి రంగుకు సూర్యకిరణాలను ప్రతిబింబించే (రిఫ్లెక్ట్ చేసే) గుణం ఎక్కువగా ఉంటుంది. ముదురు రంగులు వేడిని పీల్చుకుంటే, తెలుపు రంగు వేడిని తిరిగి ఆకాశంలోకి పంపేస్తుంది. ఈ చిన్న సైన్స్ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే ఈ కోటింగ్ పనిచేస్తుంది. దీనివల్ల కాంక్రీట్ శ్లాబ్ వేడెక్కదు. ఫలితంగా కింద ఉన్న గదుల్లో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. పూర్వ కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సున్నం వేయడానికి కారణం ఇదే.

ACకి ప్రత్యామ్నాయమా?

ఈ తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి వల్ల ఏసీ లాంటి చల్లదనం రాకపోయినా, ఇంట్లోని ఉక్కపోతను చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు, ఏసీలు కొనలేని వారికి ఇదొక అద్భుతమైన ఆప్షన్. పైకప్పు వేడిని తగ్గించడం ద్వారా కరెంట్ బిల్లులను కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే బిల్డింగ్ రకం, ఎండ తీవ్రతను బట్టి దీని ఫలితాలు కొద్దిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ వేసవికి ఇదొక ఉత్తమమైన ప్రత్యామ్నాయం అని చెప్పక తప్పదు.

Also Read: ఐదు క్రేజీ కలర్స్‌, గేమింగ్ లుక్‌తో వచ్చేస్తోన్న Ai Plus 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లుక్ లీక్!

Related News

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

Big Stories

Advertisement
×