E-Paper
Advertisement

Airtel:- 3000 ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు..

Airtel:- 3000 ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు..
Advertisement

Airtel:- ప్రస్తుతం ఇంటర్నెట్ స్పీడ్‌పైనే చాలామంది టైమ్‌పాస్ ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ లేనిది స్మార్ట్ ఫోన్స్ ఎందుకు దండగా అనే స్టేజ్‌కు వచ్చేశారు చాలామంది. అందుకే టెలికాం సంస్థలు కూడా యూజర్ల అవసరాలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక టెలికాం నెట్‌వర్క్ ఒక ఆఫర్‌తో ముందుకొస్తే.. దానికి పోటీగా మరో టెలికాం సంస్థ మరో ఆఫర్‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.

ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ పేరుతెచ్చుకుంది. కానీ 5జీ సర్వీసుల విషయంలో మాత్రం కాస్త వెనుకబడి ఉంది. అందుకే ఇటీవల భారతి ఎయిర్‌టెల్ ఇండియాలో 5జీ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టుగా ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3000 సిటీలలో కస్టమర్లకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌ సర్వీసుకు అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఉన్నట్టుగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

సెప్టెంబర్ 2023లోపు ఇండియాలోని ప్రతీ సిటీని, ప్రతీ గ్రామాన్ని కనెక్ట్ చేయాలని ఎయిర్‌టెల్ టార్గెట్‌గా పెట్టుకుంది. అది కూడా 5జి ప్లస్‌తోనే సాధించాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఇండియాలో 5జీ ఎంత స్పీడ్‌గా వ్యాపిస్తుందో గమనించిన ఎయిర్‌టెల్.. త్వరలోనే తాము కూడా ఈ సర్వీసులను అన్‌లిమిటెడ్‌గా అందరికీ అందించాలని సన్నాహాలు చేస్తోంది. 5జీ డేటాతో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను అందరికీ దగ్గర చేయాలని ఎయిర్‌టెల్ ప్రయత్నం.

అంతే కాకుండా ఎయిర్‌టెల్ కస్టమర్లకు మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రస్తుతం అన్ని ప్యాక్స్‌పై ఉన్న డేటా లిమిట్స్‌ను కూడా ఎయిర్‌టెల్ తొలగించాలని అనుకుంటోంది. ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం ఏ టెలికాం సంస్థ తీసుకోలేదు. అలాగే 5జీ సేవలను కూడా ఏ లిమిట్ లేకుండా అందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ 5జీ సేవల విషయంలో కస్టమర్లకు సాయంగా ఉండడం కోసం రీటైల్ స్టోర్లను కూడా ఏర్పాటు చేయనుంది.

Related News

ఈ MSI గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అన్నీ అదుర్స్.. ఒక్క ధర విషయంలోనే పెద్ద ట్విస్ట్!

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనే ఆలోచన ఉందా? 2026లో టాప్ 5G ఫోన్ల లిస్ట్ ఇదే!

ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

Big Stories

Advertisement
×