E-Paper
Advertisement

Airtel బంపరాఫర్.. రూ. 200 కే 30GB డేటా, ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం.. 20పైగా ఓటీటీలు!

Airtel బంపరాఫర్.. రూ. 200 కే 30GB డేటా, ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం.. 20పైగా ఓటీటీలు!
Advertisement

Airtel Recharge: ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. అదిరిపోయే బెనిఫిట్స్ తో రూ. 200 యాడ్ ఆన్ రీఛార్జ్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్ కింద మొబైల్ డేటాతో పాటు ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ సైతం ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 200 ప్యాక్ ప్రత్యేకతలు..

ఈ కొత్త ప్యాక్ ను ఎయిర్ టెల్ 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. 30GB హై-స్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సైతం యూజర్లకు అందిస్తోంది. ఎలాంటి ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించే వెసులుబాటును ఈ యాడ్ ఆన్ ప్యాక్ కింద ఎయిర్ టెల్ కల్పిస్తోంది. దీనికి తోడు ‘యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం’ సేవలు కూడా యూజర్లు ఫ్రీగా పొందొచ్చని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి.

20కి పైగా ఓటీటీలు ఉచితం

Advertisement

యూట్యూబ్ ప్రీమియం మాత్రమే కాకుండా.. ఈ రీఛార్జ్ ద్వారా 20కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను వీక్షించే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్ వంటి టాప్ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ ఉండటం విశేషం. ఒకే రీఛార్జ్‌తో మొబైల్ డేటా, యూట్యూబ్ ప్రీమియం, ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోరుకునేవారికి రూ.200 ప్యాక్ అద్భుతమైన ఛాన్స్ అని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి. అయితే ప్యాక్ లో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు ఏవి లభించవని స్పష్టం చేశాయి.

Also Read: జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, గార్డుల మధ్య ఘర్షణ.. తరగతులు ఆన్‌లైన్‌కు మళ్లింపు!

యూట్యూబ్ ప్రీమియంను ఎలా యాక్టివేట్ చేయాలి?

Advertisement

రూ. 200 ప్యాక్‌ రీఛార్జ్ చేసిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం బెనిఫిట్‌ను ప్రత్యేకంగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్ టెల్ తెలిపింది. దీన్ని ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ (Airtel Thanks) యాప్ లేదా ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపింది. యాప్ అయితే ముందుగా ‘రివార్డ్స్ అండ్ ఓటీటీ’ సెక్షన్ కు వెళ్లి.. అక్కడ యూట్యూబ్ ప్రీమియం ఆఫర్ ను క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ 28 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Also Read: ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది.. కస్టమర్లను ఎక్కించుకుంటూ.. పాక్‌తో కలిసి ఉగ్ర కుట్రలు!

Tags

Related News

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!

ఇండియాలోనే డిజైన్, ఇండియాలోనే తయారీ.. 2028 నాటికి రాబోతున్న మన సొంత ఫోన్లు!

తగ్గేదే లే అంటున్న boAt కొత్త ఇయర్‌బడ్స్..రూ.1299కే కిరాక్ ఫీచర్లు!

ట్రెండింగ్ డిజైన్‌తో వస్తున్న OnePlus Buds Clip.. ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

రూ.99,990కే 75 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీ..ఇంట్లోనే పక్కా థియేటర్ వైబ్స్!

Big Stories

Advertisement
×