E-Paper
Advertisement

శంషాబాద్‌లో హవాలా గుట్టు రట్టు.. కోటి 56 లక్షల విదేశీ కరెన్సీ సీజ్!

శంషాబాద్‌లో హవాలా గుట్టు రట్టు.. కోటి 56 లక్షల విదేశీ కరెన్సీ సీజ్!
Advertisement

Foreign Currency: చూడ్డానికి సాదాసీదా ప్రయాణికులే. చేతిలో ట్రాలీ బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు వెళ్లాల్సిన గమ్యం కౌలాలంపూర్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చాలా కూల్‌గా ఎయిర్‌ఏషియా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అయ్యారు ఇద్దరు. కానీ DRIకి మాత్రం వీళ్లపై ఎందుకో డౌట్ వచ్చింది. ఆ ఇద్దరిని ఆపి చెక్‌ చేశారు. ట్రాలీ బ్యాగులు ఓపెన్ చేస్తే… దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లు కనిపించాయి. ఆ కవర్లను ఓపెన్ చేస్తే నోట్ల కట్టలు కనిపించాయి. అవి విదేశీ డాలర్ల కట్టలు.

లెక్క చూస్తే కళ్లు తిరగాల్సిందే..

Advertisement

ఇక లెక్క చూస్తే కళ్లు తిరగాల్సిందే. మొదటి వ్యక్తి దగ్గర 66వేల 6వందల యూఎస్ డాలర్లు. వీటికి తోడు 3,773 మలేషియన్ రింగిట్లు, రెండు సింగపూర్ డాలర్లు ఉన్నాయి. వీటి విలువ 63 లక్షల 62 వేలుగా ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు. ఇక ఓ మహిళ దగ్గర 97వేల 6వందల డాలర్లు అంటే అక్షరాలా 91 లక్షల 94 వేల రూపాయలు. ఒక్కరోజే ఇద్దరు ప్రయాణికుల దగ్గర ఒక కోటి 56లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లు దొరికాయి.

క్యాష్ తీసుకెళ్తున్నారు సరే.. పేపర్లు ఏవి?

Advertisement

ఇంత క్యాష్ తీసుకెళ్తున్నారు సరే… పేపర్లు ఏవి? కొన్నట్లు రుజువు లేదు, తరలించే పర్మిషన్ లేదు. నోట్ల గురించి అడిగితే నోట్లో మాట రాలేదు. కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కరెన్సీతో పాటు ట్రాలీ బ్యాగులూ లాగేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. బట్టల మధ్య దాచేస్తే ఎవరికీ తెలియదనుకున్నారు ఆ కేటుగాళ్లు… ఇది ఎయిర్‌పోర్ట్, వాళ్ల ఇంటి అలమార కాదు.

ఈ హవాలా వెనుకున్న బిగ్ ఫిష్ ఎవరు.?

అసలు కోటిన్నర రూపాయలు వీళ్లకు ఎవరిచ్చారు? ఈ హవాలా వెనుక ఉన్న అసలు బిగ్ ఫిష్ ఎవరు? ఏ గ్యాంగ్ వీళ్లను కౌలాలంపూర్‌కి క్యారియర్లుగా వాడుకుంది? లేదంటే మరేదైనా చీకటి డీలింగ్ ఉందా.. ఈ నోట్ల చైన్‌లో ఇంకెన్ని లింకులు ఉన్నాయి? DRI టీమ్ కూపీ లాగుతోంది.

Also Read:ప్రాజెక్టులు కట్టింది మీరు.. కూలిపోతే మమ్మల్ని అంటారా?: మంత్రి ఉత్తమ్ 

Tags

Related News

మారనున్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం రూపురేఖలు.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!

దుండిగల్‌లో దారుణం.. ఇంటి తాళాలు పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించిన రౌడీషీటర్!

ప్రాజెక్టులు కట్టింది మీరు.. కూలిపోతే మమ్మల్ని అంటారా?: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్?

ఆర్టీఏలో రొటేషన్‌కు రాంరాం.. హోంగార్డులదే రాజ్యం!

రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు

సీఎం రేవంత్ ‘విజన్ 6 మంత్ర’.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన టాస్క్‌ ఇదే?

Big Stories

Advertisement
×