E-Paper
Advertisement

Airtel Plans: దుమ్మురేపుతున్న టాప్ 2 ప్లాన్స్.. అవి ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్?

Airtel Plans: దుమ్మురేపుతున్న టాప్ 2 ప్లాన్స్.. అవి ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్?
Advertisement

Airtel Plans: దేశంలో అత్యధిక యూజర్లను కలిగిన ప్రైవేటు టెలికాం రంగ సంస్థల్లో భారతీ ఎయిర్ టెల్ ఒకటి. ఈ సంస్థ క్వాలిటీ నెట్ వర్క్, వేగవంతమైన డేటాకు బాగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఎయిర్ టెల్ ఇటీవల తన రూ.859 ప్లాన్ ను రూ.899కి అమాంతం పెంచేసింది. అయితే దానికి అదనంగా మరో రూ.30 రూపాయలు ఖర్చు చేస్తే దానికంటే బెటర్ బెన్ ఫిట్స్ ఉన్న రూ.929 ప్లాన్ ను పొందొచ్చు. ఇంతకీ ఈ రెండు ప్లాన్ల మధ్య వ్యత్యాసాలేంటి? ఏది రీఛార్జ్ చేసుకుంటే బెటర్? ఇప్పుడు చూద్దాం.

వాలిడిటీ పరంగా..

ఎయిర్ టెల్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసంగా వ్యాలిడిటీని చెప్పవచ్చు. రూ.899 ప్లాన్ కేవలం 84 రోజులకు మాత్రమే పరిమితం కాగా.. రూ.929 ప్లాన్ మీకు పూర్తి 90 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అంటే రూ.929 ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు అదనంగా 6 రోజుల పాటు సేవలను పొందవచ్చు.

మీ ఖర్చుకు ఏది వర్త్..

Advertisement

ధర పరంగా చూస్తే రూ.899 ప్లాన్‌తో పోలిస్తే రూ.929 ప్లాన్ కేవలం రూ.30 మాత్రమే ఎక్కువ. అయితే సగటు రోజువారీ ఖర్చును (వాలిడిటీ) గమనిస్తే రూ.929 ప్లాన్ చౌకగా అనిపిస్తుంది. రూ.899 ప్లాన్‌లో రోజుకు సుమారు రూ.10.70 ఖర్చవుతుండగా.. రూ.929 ప్లాన్‌లో రోజుకు కేవలం రూ.10.32 మాత్రమే ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సేవలు పొందాలనుకునే వారికి ఇది బెస్ట్.

డేటా, కాలింగ్

డేటా విషయంలో ఈ రెండు ప్లాన్‌లు ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయి. రెండింటిలోనూ రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, STD కాలింగ్ సౌకర్యం ఉంటుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌ల సదుపాయం కూడా ఈ రెండు ప్లాన్‌లలో సమానంగా లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

Advertisement

సాధారణంగా ఎయిర్‌టెల్ తన లాంగ్-టర్మ్ ప్లాన్‌లపై ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ ప్రయోజనాలను అందిస్తోంది. కాబట్టి ఈ రెండు ప్లాన్లలో ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, స్ప్యామ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే రూ.929 ప్లాన్ ఎంచుకున్నప్పుడు మీరు ఈ అదనపు ప్రయోజనాలను 6 రోజులు ఎక్కువగా పొందే అవకాశం ఉంది..

Also Read: ఏంది భయ్యా ఇది.. Poco నుంచి ఇలాంటి క్రేజీ ఫోన్స్.. కలలో కూడా ఊహించలే!

ఓవరాల్‌గా ఏది బెస్ట్..?

మొత్తంగా చూస్తే రూ. 899 ప్లాన్ కంటే రూ.929 ప్లాన్ అన్ని విధాలా బెస్ట్ అని చెప్పవచ్చు. కేవలం రూ.30 ఖర్చుతో దాదాపు వారం రోజుల (6 రోజులు) అదనపు వాలిడిటీ రావడం వినియోగదారులకు కలిసిరానుంది. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి 3 నెలల వాలిడిటీ కోరుకునే వారికి రూ.929 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

Also Read: కొత్త ఏసీ కావాలా? డైకిన్ వెరీ రీజనబుల్ ఏసీలు.. ధర తక్కువ కూలింగ్ ఎక్కువ!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×