E-Paper
Advertisement

Google Bond: 2126లో గూగుల్ కంపెనీ మూసివేయబడుతుందా? 100 ఏళ్లకు సరిపడ అప్పు తీసుకుంటున్న టెక్ దిగ్గజం.. ఎందుకంటే

Google Bond: 2126లో గూగుల్ కంపెనీ మూసివేయబడుతుందా? 100 ఏళ్లకు సరిపడ అప్పు తీసుకుంటున్న టెక్ దిగ్గజం.. ఎందుకంటే
Advertisement

Google Bond| దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఇటీవలే 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1998లో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. దాని మాతృక సంస్థ Alphabet (ఆల్ఫబెట్).. 100 ఏళ్ల మెచ్యూరిటీతో బాండ్లు జారీ చేసింది. ఈ బాండ్లు 2126లో పూర్తిగా మెచ్యూర్ అవుతాయి. టెక్నాలజీ రంగంలో ఇంత ఎక్కువ గడువు ఉండే బాండ్లు (లాంగ్-టర్మ్ బాండ్లు) చాలా అరుదు. ఈ బాండ్లు జారీ చేసి భారీ మొత్తంలో అప్పు తీసుకోనుంది.

భారీగా నిధులు సేకరిస్తున్న ఆల్ఫబెట్

మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఆల్ఫబెట్ కంపెనీ సుమారు 20 బిలియన్ డాలర్లు సేకరించాలని ప్లాన్ చేసింది. ఈ బాండ్లు వివిధ దేశాల కరెన్సీలలో జారీ అవుతున్నాయి. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం ఏడు భాగాలుగా విభజించారు. వాటిలో ఒక భాగం 100 ఏళ్ల మెచ్యూరిటీ బాండ్. ఈ బాండ్ చూసి ఇన్వెస్టర్లు, ఇండస్ట్రీ నిపుణులు ఆశ్చర్యపరిచారు.

AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా పెట్టుబడులు

Advertisement

ఈ బాండ్ల ద్వారా పొందే డబ్బుతో గూగుల్ పెద్ద AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేయాలని ప్లాన్ చేస్తోంది. అడ్వాన్స్‌డ్ డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సిస్టమ్స్ నిర్మాణం జరుగుతుంది. అల్ఫాబెట్ AIని దీర్ఘకాలిక గ్రోత్ డ్రైవర్‌గా చూస్తోంది. సర్వర్లు, చిప్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మొత్తం 185 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ కంపెనీలు

గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు.. AIని ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీగా భావిస్తున్నాయి. AI పరిశ్రమలు, రోజువారీ జీవితాన్ని మార్చేస్తుందని నమ్ముతున్నాయి. ఈ ఏడాది దిగ్గజ టెక్ కంపెనీలు 660 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నాయి. ఇది గత ఏడాది చేసిన ఖర్చు కంటే 60 శాతం ఎక్కువ

AI ఇన్వెస్ట్‌మెంట్ బబుల్ రావచ్చా?

Advertisement

కొందరు నిపుణులు AIపై అతిగా ఖర్చు చేస్తున్నారని, బబుల్ (పేలిపోయే బుడగ) ఏర్పడవచ్చని అంటే ఏఐ ద్వారా ఆశించిన లాభాలు రావపోవచ్చు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తక్షణ రాబడి రాకపోవచ్చని భయపడుతున్నారు. అయినప్పటికీ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీర్ఘకాలంలో పెద్ద లాభాలు వస్తాయని నమ్ముతున్నాయి. Alphabet ఈ 100 ఏళ్ల బాండ్ ద్వారా దీర్ఘకాలిక ఆలోచన చూపిస్తోంది.

ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్

Alphabet కంపెనీ జారీ చేసిన బాండ్లకు చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది. మొత్తం ఆర్డర్లు దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది అన్ని మెచ్యూరిటీల బాండ్లు కలిపి. 100 ఏళ్ల బాండ్‌కు మాత్రమే కాదు.. అంటే Alphabet భవిష్యత్తుపై పెట్టుబడిదారులు పెట్టుకున్న నమ్మకం చూపిస్తోంది.

Also Read: పాత సిమ్ కార్డ్‌తో లక్షలు విలువ చేసే బంగారం.. రూ.కోట్లు సంపాదించే అవకాశం.. ట్రై చేయండి

ఆర్థికపరంగా బలంగా ఉన్న గూగుల్ మాత‌ృక

2025లో Alphabet రికార్డు 400 బిలియన్ డాలర్ల రెవెన్యూ సంపాదించింది. సుమారు 127 బిలియన్ డాలర్ల క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. గత నవంబర్‌లో 17.5 బిలియన్ డాలర్లు సేకరించింది. ఈ ఆర్థిక బలం దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ధైర్యం ఇస్తోంది.

100 ఏళ్ల బాండ్లు చాలా అరుదు

100 ఏళ్ల బాండ్లు చాలా తక్కువ సంస్థలు జారీ చేస్తాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, వెల్‌కమ్ ట్రస్ట్, EDF, డిస్నీ వంటివి గతంలో చేశాయి. డాట్-కామ్ క్రాష్ తర్వాత టెక్ కంపెనీలు దూరంగా ఉన్నాయి.

Alphabet జారీ చేసిన ఈ బాండ్లు టెక్ ఇండస్ట్రీకి పెద్ద సంకేతం. కంపెనీ మరిన్ని దశాబ్దాల పాటు ఉండి, రిలెవెంట్‌గా ఉంటుందని నమ్ముతోంది. ఇన్నోవేషన్, స్థిరత్వంపై దీర్ఘకాలిక నమ్మకం చూపిస్తోంది. ఇతర టెక్ కంపెనీలకు భిన్నంగా భవిష్యత్తును చూస్తోంది.

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×