E-Paper
Advertisement

Simcard Gold Extract: పాత సిమ్ కార్డ్‌తో లక్షలు విలువ చేసే బంగారం.. రూ.కోట్లు సంపాదించే అవకాశం.. ట్రై చేయండి

Simcard Gold Extract: పాత సిమ్ కార్డ్‌తో లక్షలు విలువ చేసే బంగారం.. రూ.కోట్లు సంపాదించే అవకాశం.. ట్రై చేయండి
Advertisement

Simcard Gold Extract| సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో చైనాకు చెందిన ఒక వ్యక్తి పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ స్క్రాప్ నుంచి బంగారం ఎలా తయారు చేయాలో చూపించాడు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆశ్చర్యపరిచింది. వ్యర్థ ఎలక్ట్రానిక్ సామగ్రి నుంచి బంగారం బయటపడటం చూసి చాలా మంది షాకైపోయారు. కొందరు పాత సిమ్ కార్డులను రీసేల్ ప్లాట్‌ఫామ్‌లలో కొనడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమని వీడియోలోనే ఆ వ్యక్తి హెచ్చరించాడు. సామాన్యులు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని స్పష్టంగా చెప్పాడు.

వీడియో వెనక ఉన్న వ్యక్తి ఎవరు?

చైనా మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ వీడియో చేసిన వ్యక్తి తన పేరును “Qiao” అని తెలిపాడు. అతను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిజౌ నగరానికి చెందినవాడు  నివసిస్తాడు. Qiao ప్రొఫెషనల్‌గా ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి బంగారం, ఇతర ఖరీదైన లోహాలను తీసే పని చేస్తాడు. జనవరి 20న అతను ఈ ప్రక్రియను వివరంగా చూపించే వీడియో అప్‌లోడ్ చేశాడు. పాత సిమ్ కార్డులు, చిప్ వేస్ట్‌ను కెమికల్ నిండిన కంటైనర్లలో పెట్టాడు. ఈ ప్రక్రియలో భాగంగా రస్టింగ్, కెమికల్ రియాక్షన్స్, హై హీట్ ట్రీట్‌మెంట్ వంటి దశల గురించి చెప్పాడు.

బంగారం ఎలా తీశాడు?

Advertisement

వీడియోలో ఇండస్ట్రియల్ కెమికల్స్, హీట్ ట్రీట్‌మెంట్ ద్వారా బంగారం తీసే ప్రక్రియ చూపించాడు. ముద్దలా ఉన్న బంగారు పేస్ట్‌ను ఫిల్టర్ చేసి మళ్లీ హీట్ చేశాడు. చివరికి శుద్ధి చేసిన బంగారు ముక్కలు ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో ప్రక్రియలో సుమారు 191 గ్రాముల బంగారం తీశానని తెలిపాడు. దీని విలువ సుమారు 2 లక్షల యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ.26 లక్షల) అని తెలిపాడు. ఈ బంగారం తీయడానికి రెండు టన్నుల స్క్రాప్ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది.

సిమ్ కార్డుల్లో బంగారం తక్కువే ఉంటుంది?

వీడియోలో Qiao వివరిస్తూ.. సిమ్ కార్డులు మాత్రమే కాదు, టెలికాం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిప్ వేస్ట్ కూడా ఉపయోగించానని చెప్పాడు. సిమ్ కార్డుల్లో కాంటాక్ట్ పార్ట్స్‌పై చిన్న బంగారు కోటింగ్ ఉంటుంది. ఇది రస్ట్ నివారణకు, ఎలక్ట్రానిక్ కనెక్షన్ల మన్నికకు సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. ఒక సిమ్ కార్డ్‌లో 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం ఉంటుంది. ఉపయోగకరమైన బంగారం తీయాలంటే చాలా పెద్ద మొత్తంలో వేస్ట్ అవసరం. బ్యాంక్ కార్డులు, కమ్యూనికేషన్ డివైస్‌లలో కూడా చిన్న మొత్తంలో బంగారం ఉంటుంది.

Advertisement

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా ఆఫ్ చేయండి

పెరిగిన పాత సిమ్ కార్డుల డిమాండ్

వీడియో వైరల్ అయ్యాక చైనాలో పాత సిమ్ కార్డుల డిమాండ్ హఠాత్తుగా పెరిగింది. ఎలక్ట్రానిక్ స్క్రాప్ బిజినెస్ అవకాశాలు వెతకడం మొదలుపెట్టారు. చాలా మంది సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించారు. కానీ నిపుణులు ఇది ప్రమాదకరమైన, తప్పుడు ఆలోచన అని హెచ్చరిస్తున్నారు.

చాలా ప్రమాదకరం

Qiao తన పని చట్టబద్ధంగా, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తూ చేస్తానని చెప్పాడు. అతనికి ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్‌కు సర్టిఫికేషన్లు ఉన్నాయి. సరైన శిక్షణ లేకుండా ఈ పద్ధతిని అనుసరించవద్దని హెచ్చరించాడు. కెమికల్స్ తప్పుగా హ్యాండిల్ చేస్తే తీవ్ర గాయాలు లేదా మరణం సంభవించవచ్చు. చాలా దేశాల్లో ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం కావచ్చు. కెమికల్ వేస్ట్ సరిగా డిస్పోజ్ చేయకపోతే పర్యావరణానికి హాని జరుగుతుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×