Washing Machine Tips: ప్రస్తుత రోజుల్లో బట్టలు ఉతకడానికి చాలా మంది వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లల్లో వాషింగ్ మిషన్లపై ఆధారపడుతున్నారు. ఇదిలా ఉంటే వాషింగ్ మిషన్లు వాడేవారికి.. దుస్తుల భద్రత విషయంలో ఎప్పుడూ కాస్త ఆందోళన ఉంటూనే ఉంటుంది. వాషింగ్ సమయంలో దుస్తులు గుండ్రంగా తిరుగుతూ ఒకదానికొకటి రాపిడి గురై పాడవుతున్నాయని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అల్యూమినియం ఫాయిల్ (Aluminum Foil)తో దుస్తుల నాణ్యతను ఏ విధంగా కాపాడుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా బట్టలు వాషింగ్ మిషన్ లో తిరుగుతున్నప్పుడు ఒకదానికొకటి ఢీకొంటూ రాపిడి జరుగుతుంది. ఆ సమయంలో ఒక రకమైన స్థిర విద్యుత్ ఏర్పడి.. బట్టలు ఒకదానికొకటి అంటుకుపోవడం, జుట్టు లేదా పెంపుడు జంతువుల వెంట్రుకలు బట్టలకు అతుక్కోవడం వంటివి జరుగుతాయి. దీనికి అల్యూమినియం ఫాయిల్ ద్వారా చెక్ పెట్టవచ్చు. ఫాయిల్ ను చిన్నబంతుల్లా ఉండ చుట్టి.. వాషింగ్ మిషన్ లో వేస్తే.. ఆ స్థిర విద్యుత్ ను అల్యూమినియం ఫాయిల్ గ్రహిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల బట్టల నాణ్యత దెబ్బతినకుండా ఉంటాయని పేర్కొంటున్నారు.
ఈ చిట్కాలను ఫాలో అయ్యే క్రమంలో కొన్ని స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా ఒక సాధారణ అల్యూమినియం ఫాయిల్ ను తీసుకొని.. టెన్నిస్ బాల్ పరిమాణంలో రెండు లేదా మూడు గట్టి బంతుల్లా చుట్టండి. అనంతరం వాషింగ్ మిషన్ లో బట్టలతో పాటు ఈ ఫాయిల్ బాల్స్ ను సైతం డ్రమ్ములో వేయండి. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఘర్షణ నుంచి బట్టలు భద్రంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా వస్తాయి. మరోవైపు ఈ గుండ్రంగా చుట్టిన అల్యూమినియం ఫాయిల్ బాల్స్.. 6 నెలల వరకూ పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వాడిన తర్వాత వాషింగ్ మిషన్ నుంచి తీసి.. మళ్లీ వాడుకోవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: AC Cooling Tips: సర్వీసింగ్ చేయించినా.. ఏసీ కూలింగ్ రావడం లేదా? వెంటనే ఇలా చేయండి!
ముందుగా చెప్పుకున్నట్లే వాషింగ్ మిషన్ లో అల్యూమినియం ఫాయిల్ బాల్స్ వేయడం వల్ల బట్టలు ఒకదానితో ఒకటి అతుక్కుపోవు. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ వంటివి వాడకుండానే బట్టలు కొంతవరకు మెత్తగా అనిపిస్తాయి. ఖరీదైన డ్రయ్యర్ షీట్స్ (Dryer Sheets) కొనాల్సిన అవసరాన్ని ఈ చిట్కా తగ్గిస్తుంది. అలాగే వాషింగ్ సమయంలో బట్టలకు అంటుకున్న చిన్నపాటి ధూళి కణాలు, జుట్టు సులభంగా తొలగిపోతాయి. అయితే ఈ స్మార్ట్ చిట్కా.. స్టాటిక్ ఎలక్ట్రిసిటీని తొలగించడానికి మాత్రమే పనిచేస్తుంది. బట్టలపై ఉన్న మెుండి మరకలను ఇది ఏమాత్రం తొలగించదు. కాగా, ఫాయిల్ బాల్స్ మరి గరుకుగా లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మెత్తటి వస్త్రాలు పాడయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
Also Read: Kitchen Tips: వంటగది షెల్ఫ్స్‌లో.. అల్యూమినియం ఫాయిల్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?