E-Paper
Advertisement

Kitchen Tips: వంటగది షెల్ఫ్స్‌లో.. అల్యూమినియం ఫాయిల్‌.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Kitchen Tips: వంటగది షెల్ఫ్స్‌లో.. అల్యూమినియం ఫాయిల్‌.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Advertisement

Kitchen Tips: ప్రస్తుతం చాలా మంది తమ వంటగది డ్రాయర్లలో అల్యూమినియం ఫాయిల్ కవర్లను ఉపయోగిస్తున్నారు. దీనిని ఒక స్మార్ట్ కిచెన్ టిప్ గా నిపుణులు సైతం అభివర్ణిస్తున్నారు. అయితే కొందరికి మాత్రం ఈ అల్యూమినియం కవర్లు వినియోగానికి కారాణాలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి వాటిని కిచెన్ షెల్ఫ్ లలో పెట్టడం వల్ల కలిగే లాభాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

షెల్ఫ్‌ల పరిశుభ్రత

కిచెన్ డ్రాయర్లలో ఫాయిల్ పేపర్‌ను పరచడం వల్ల నూనె మరకలు, మసాలా పొడులు, ఇతర ఆహార పదార్థాలు నేరుగా డ్రాయర్ ఉపరితలానికి అంటవు. ఫలితంగా డ్రాయర్ అడుగుభాగం అనిపించకుండా ఎప్పుడు ఫ్రెష్ లుక్ ను కలిగి ఉంటుంది. ఒకవేళ మరకలతో అల్యూమినియం ఫాయిల్ పాడైనా.. దాని స్థానంలో కొత్తది పెట్టి నిమిషాల్లో షెల్ఫ్ ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

బొద్దింక, చీమలకు చెక్

Advertisement

షెల్ఫ్ లోపల కీటకాలు తిష్ట వేయకుండా అల్యూమినియం ఫాయిల్స్.. రక్షణగా నిలుస్తాయి. ఫాయిల్ కు ఉన్న మెరుపు, దానిపై పడే కాంతి ప్రతిబింబం బొద్దింకలు, చీమలు, ఇతర కీటకాలను దరిచేరనివ్వదు. ముఖ్యంగా వెలుతురు తక్కువగా పడే డ్రాయర్లలో అల్యూమినియం కవర్.. కీటకాలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

తేమ నుండి రక్షణ

వంటగదిలో సాధారణంగా తడి లేదా తేమ వాతావరణం అధికంగా ఉంటుంది. కడిగిన స్పూన్లు, ప్లేట్లు, గిన్నెలను చెక్క డ్రాయర్లలో పెట్టినప్పుడు అవి తేమను పీల్చుకొని పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అల్యూమినియం ఫాయిల్ ను షెల్ఫ్ లో పెట్టడం వల్ల అది చెక్కకు, గిన్నెలకు మధ్య లేయర్ గా ఉంటూ షెల్ఫ్ పాడవ్వకుండా రక్షణ కల్పిస్తుంది. చెక్క దెబ్బతినకుండా, బూజు పట్టకుండా కాపాడుతుంది.

వస్తువుల భద్రత

Advertisement

స్టీల్ స్పూన్లు, కత్తులు వంటి పదునైన వస్తువులను నేరుగా షెల్ఫ్ లలో వేస్తే.. డ్రాయర్ ను ఓపెన్ చేసిన ప్రతీసారి అవి కదిలి.. డ్రాయర్ అడుగుభాగంలో గీతలు పడే చేయవచ్చు. కాబట్టి అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

Also Read: Water Disruption: విద్యుత్ కోతల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు.. ఆ ఏరియాలకు అలర్ట్!

తక్కువ ఖర్చు

కొందరు కిచెన్ ను లుక్ ను అందంగా మార్చేందుకు రంగురంగుల డ్రాయర్ లైనర్స్ (Drawer Liners) ఉపయోగిస్తుంటారు. వాటితో పోలిస్తే అల్యూమినియం ఫాయిల్ చాలా చౌకగా లభిస్తుంది. అలాగే దీనిని ఏ సైజు డ్రాయర్‌కైనా సులభంగా కట్ చేసి అమర్చుకోవచ్చు.

Also Read: ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా? కొంపలు అంటుకుపోతాయ్.. ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

Big Stories

Advertisement
×