Mrunal Thakur:ధనుష్… మృణాల్ ఠాకూర్.. వీళ్ళ మధ్య ఎదో ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా తెగ ఊదరగొట్టేస్తుంది. అయితే మా మధ్య మీరనుకుంటున్నట్టుగా ఏమీ లేదంటూ ఎప్పటికప్పుడు మృణాల్ క్లారిటీ ఇచ్చినా అబ్బే మేము నమ్మముగా అంటూ వచ్చిన గాసిప్స్ ని మరింత వైరల్ చేసుకుపోతున్నారు నెటిజన్లు. అవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాయన్, ఇడ్లీ కడాయ్ సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు ఒక భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారట.ఇందులో మెయిన్ లీడ్‌గా అందాల భామ మృణాల్ ఠాకూర్ నటించబోతుందని కోడై కూస్తుంది కోలీవుడ్.
మృణాల్ ఒక “దేవత” లాంటి పాత్రలో
ఈ సినిమాలో మృణాల్ ఒక “దేవత” లాంటి పాత్రలో కనిపించబోతుందట. ఇదొక పీరియాడిక్ డ్రామా అని, ఆమె క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. ముఖ్యంగా 1970ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుందని, దీనికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఇక ధనుష్ తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారని సమాచారం. అయితే మేకర్స్ నుండి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్
ఇక మృణాల్ – ధనుష్ విషయానికి వస్తే ‘రాయన్’ ఆడియో లాంచ్ వేడుకకు మృణాల్ ఠాకూర్ హాజరు కావడంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఇక అప్పటి నుండే వీరిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత చెన్నైలో జరిగిన కొన్ని సినీ పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఫోటోలకు ఫోజులివ్వడం ఈ రూమర్లకు మరింత బూస్టప్ నిచ్చాయి.ఇక ఒకానొక సందర్భంలో మృణాల్ ఠాకూర్ ధనుష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ధనుష్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే వస్తున్న రూమర్లకి మృణాల్ ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇచ్చినా ఆగకపోవడం గమనార్హం.
ఇన్ని రూమర్స్ మధ్యలో కూడా
ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ అమ్మడు తాజాగా డెకాయిట్ తో మరోసారి పలరించిన సంగతి తెల్సిందే. ఏది ఏమైనా ఇన్ని రూమర్స్ మధ్యలో కూడా ధనుష్ ఏరికోరి మృణాల్ కి తన సినిమాలో మెయిన్ లీడ్ గా అవకాశం ఇస్తున్నాడంటే ధనుష్ గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. చూడాలి మరి ముందు ముందు ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ సంథింగ్ సంథింగ్ ఎంటన్నది ఎప్పుడు బయటపడుతుందో!
also read:దేవర 2 అటకెక్కినట్టేనా? కొరటాలకు ఎన్టీఆర్ హ్యాండ్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!