E-Paper
Advertisement

OnePlus 13 Price Drop: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13పై ఊహించని డిస్కౌంట్, స్టాక్ అయిపోయేలోపు కొనేయండి!

OnePlus 13 Price Drop: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13పై ఊహించని డిస్కౌంట్, స్టాక్ అయిపోయేలోపు కొనేయండి!
Advertisement

OnePlus 13 Price Drop: వన్‌ప్లస్ అభిమానులకు అమెజాన్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. శక్తివంతమైన ఫీచర్లతో ప్రీమియం సెగ్మెంట్లో సంచలనం సృష్టించిన OnePlus 13 పై ఇప్పుడు భారీ ధర తగ్గింపు లభిస్తోంది. మీరు గనుక హైఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.

భారీగా తగ్గిన ధర:

ఈ OnePlus 13 విడుదలైన సమయంలో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా దీనిపై నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.61,999కే వచ్చేస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే అదనంగా మరో రూ.4,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో మొత్తంగా రూ.12,000 ఆదా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: పోగొట్టుకున్న వస్తువులను వెతకడం ఇక చిటికెలో పని.. ఆపిల్ కొత్త ఎయిర్‌ట్యాగ్ వచ్చేసిందోచ్!

వన్‌ప్లస్ 13 ఫీచర్లు:

ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల 2K+ LTPO అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ డిస్‌ప్లే.. ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక స్పీడ్ విషయానికొస్తే.. దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ ఏదైనా సరే.. ఈ ఫోన్ అసలు హ్యాంగ్ అవ్వకుండా మెరుగైన అనుభూతిని ఇస్తుంది.

ఫొటోగ్రఫీ ప్రియులకు పండగే:

Advertisement

వన్2ప్లస్ 13 ఫోన్.. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు, మరో 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌లను అందించారు. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ ద్వారా ప్రొఫెషనల్ స్థాయి ఫొటోలను క్లిక్ చేయొచ్చు. ఇక సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండగా.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 15 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.

నిమిషాల్లో ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో భారీ 6000mAh బ్యాటరీని అమర్చారు. 100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో.. కేవలం 36 నిమిషాల్లోనే జీరో నుండి 100% ఛార్జ్ అవుతుంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అమెజాన్ డీల్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Also Read: మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. మోటరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్, పూర్తి వివరాలు ఇవిగో!

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×