Amazon Black Friday Sale: అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫార్మ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలయ్యాక భారీ ఆఫర్లు వరుసగా వచ్చాయి. ప్రత్యేకంగా ప్రీమియం కేటగిరీలో ఉన్న పలు మోడల్స్ పై తగ్గింపులు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో అత్యధికంగా చర్చకు వచ్చిన డీల్ అంటే గూగుల్ పిక్సెల్ 10 మీద అమెజాన్ ప్రకటించిన భారీ తగ్గింపు. ఇటీవల లాంచ్ అయిన పిక్సెల్ 10 వంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ పై ఇంత పెద్ద తగ్గింపు రావడం చాలా అరుదు. అందుకే అమెజాన్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ ఇప్పుడు టెక్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ప్రైజ్ డ్రాప్ కావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదని వెంటనే చెక్ చేస్తున్నారు, ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ టైమ్‌లో పూర్తిగా అమ్ముడైపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
క్లాసీ ఫీల్ డిజైన్
డిజైన్ విషయంలో పిక్సెల్ 10 ప్రీమియం క్వాలిటీ ని వెంటనే తెలియజేస్తుంది. హ్యాండ్ లో పట్టుకున్న క్షణం నుండి సాలిడ్ బిల్డ్ తో కూడిన స్లిమ్ ఫ్రేమ్ ఒక క్లాసీ ఫీల్ ఇస్తుంది. వెనుక భాగంలో కలర్ ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, ఆబ్సిడియన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం విసువల్ లుక్, రోజువారీ వాడకంలో కంఫర్ట్ రెండూ కలిసిన డిజైన్‌గా కనిపిస్తుంది. ఫోన్‌ను చూసిన క్షణంలోనే ఇది హై ఎండ్ క్యాటగిరీలోనిది అని స్పష్టంగా తెలుస్తుంది.
రిఫ్లెక్షన్ సమస్య ఉండదు
డిస్‌ప్లే విషయానికి వస్తే 6.3 అంగుళాల ఒలీడ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. స్క్రోల్, వీడియోలు, గేమింగ్ అన్నీ చాలా స్మూత్ అనుభవంగా కనిపిస్తాయి. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఔట్‌డోర్ లో కూడా కాంటెంట్ స్పష్టంగా, క్లీన్ గా కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ సమస్యలు లేకుండా చూడటం ఈ డిస్‌ప్లే ప్రధాన గుణం. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఇచ్చారు. దీని వల్ల పడిపోయే ప్రమాదాల్లో స్క్రీన్ హై లెవెల్ సేఫ్టీ పొందుతుంది.
48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మాక్రో
కెమెరా అనుభవంలో పిక్సెల్ పేరు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిందే. పిక్సెల్ 10 లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మాక్రో ఫోకస్‌తో వస్తోంది. క్లోజ్ షాట్స్ లో ఫోటో ప్రతీ డీటైల్ ని స్పష్టంగా చూపిస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ద్వారా లార్జ్ ఫ్రేమ్స్ నేచురల్ పర్స్పెక్టివ్ తో కనిపిస్తాయి. 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో డిస్టెన్స్ సబ్జెక్ట్స్ కూడా క్వాలిటీ కోల్పోకుండా కనిపిస్తాయి. వెలుగు లేకున్నా తీసిన ఫోటోలు కూడా నైట్ మోడ్ ద్వారా చాలా రియలిస్టిక్ అవుతాయి. సెల్ఫీస్ కోసం 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం వల్ల వీడియో కాల్స్ కాని, సోషల్ మీడియా ఫోటోలు కాని చాలా క్లియర్ అవుట్‌పుట్ ఇస్తుంది.
ప్యూర్ ఆండ్రాయిడ్‌తో క్లటర్
సాఫ్ట్‌వేర్ అనుభవం పిక్సెల్ ఫోన్స్ లో ప్రత్యేకతగా ఉంటుంది. ప్యూర్ ఆండ్రాయిడ్ తో క్లటర్ లేకుండా క్లీన్ యూఐ వాడే వారికి ఇది పెద్ద ప్రయోజనం. టెన్సర్ .జి5 ఆధారిత ఏఐ సామర్థ్యాలు రోజువారీ ఉపయోగాన్ని మరింత తెలివైనదిగా మారుస్తాయి. ఫోటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్‌లేట్, స్మార్ట్ సజెషన్స్, ఆన్ డివైస్ ప్రాసెసింగ్ అన్నీ తదుపరి తరానికే చెందిన అనుభూతిని ఇస్తాయి. టైమ్ గడిచేకొద్దీ ఫోన్ యూజర్ స్టైల్‌ని నేర్చుకుని మరింత స్మార్ట్ అవుతుంది. అప్‌డేట్స్ కూడా పలు సంవత్సరాలపాటు క్రమంగా వచ్చేవి.
అసలైన ధర.. ఆఫర్ ధర తెలుసుకుందాం..
ఇప్పుడు అసలు ప్రైజ్ విషయానికి వస్తే భారతదేశంలో పిక్సెల్ 10 లాంచ్ సమయంలో ప్రైజ్ 79,999 రూపాయలు. బ్లాక్ ఫ్రైడే సేల్ లో అమెజాన్ లో ప్రస్తుత ప్రైజ్ 68,700 రూపాయలు. అంటే స్ట్రైట్ గా 11,299 రూపాయల తగ్గింపు వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ వాడితే అదనంగా 4,000 రూపాయలు తగ్గుతాయి. మొత్తం కలిపి చూసినప్పుడు సుమారు 15,299 రూపాయల తగ్గింపు వస్తోంది. అంటే సుమారు 19 శాతం వరకు డిస్కౌంట్ తో వినియోగదారులకు ఆఫర్ తో రానుంది. ఈ రేంజ్ లో తగ్గింపు చాలా అరుదు. అందుకే ఈ డీల్ బ్లాక్ ఫ్రైడే లో బెస్ట్ ఆఫర్ లిస్ట్ లో టాప్ గా నిలిచింది. బ్లాక్ ఫ్రైడే ఇంత తగ్గింపు అంటే ఎవరు కొనకుండా ఊరికే ఉంటారు బ్రో.. ఈ ఆఫర్ మళ్లీ రాదు కాబట్టి వెంటనే ఈ డీల్ మీ సొంతం చేసుకుని గూగుల్ పిక్సెల్ 10ను మీ సొంతం చేసుకోండి.