E-Paper
Advertisement

Rahul Sipligunj -Harinya Haldi: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య హాల్దీ..మెహందీ ఫొటోలు వైరల్!

Rahul Sipligunj -Harinya Haldi: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య హాల్దీ..మెహందీ ఫొటోలు వైరల్!
Advertisement

Rahul Sipligunj -Harinya Haldi: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ , హరిణ్య మరి కొన్ని గంటలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), హరిణ్య రెడ్డి (Harinya Reddy)ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారు. మూడు నెలల క్రితం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట నవంబర్ 27వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మరి కొన్ని గంటలలో వీరి పెళ్లి వేడుక జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సంగీత్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ తన కాబోయే భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే . తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ఛాహల్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావడంతో హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఘనంగా హల్దీ, మెహందీ వేడుక..

ఇలా సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి .అయితే తాజాగా వీరి హల్దీ (Haldi)మెహందీ (mehendi)వేడుకలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను రాహుల్, హరిణ్యా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ సమక్షంలో వీరి హల్దీ మెహందీ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక వీరి వివాహానికి పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే.

హాజరుకానున్న సినీ రాజకీయ ప్రముఖులు..

Advertisement

రాహుల్ హరిణ్య స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వీరి వివాహ మొదటి ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి ఇచ్చి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇలా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇలా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ముందుగానే ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఆస్కార్ అవార్డుతో మరింత గుర్తింపు…

Advertisement

ఇక వీరి వివాహం హైదరాబాద్ లోనే జరగనుంది. హరిణ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఇక రాహుల్ విషయానికి వస్తే ఈయన ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటను రాహుల్ పాడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయనకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం సింగర్ గా మాత్రమే కాకుండా సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు రాహుల్ జడ్జిగా కూడా వ్యవహరిస్తూ రాహుల్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Jr.NTR: జాతకం చూపించి మరీ ఎన్టీఆర్ తో సినిమా చేసిన ప్రొడ్యూసర్…అన్ని ఆయన పోలికలే అంటూ!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×