E-Paper
Advertisement

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య? జైలు వద్ద అభిమానుల ఆందోళన

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య? జైలు వద్ద అభిమానుల ఆందోళన
Advertisement

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో మరణించారనే పుకార్లు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించాయి. అఫ్ఘాన్ మీడియా కథనాలను అనుసరించి ఈ వార్తలు వైరల్ కావడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు వేలాదిగా అడియాలా జైలు వద్దకు తరలివచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

పాక్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయిన ఇమ్రాన్, అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. ఆ తర్వాత అవినీతి, హింస, ఉగ్రవాదం వంటి 20కి పైగా కేసులలో ఆయనకు శిక్ష పడింది. ఇవన్నీ రాజకీయ కుట్రలని ఇమ్రాన్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారనిజజ అనధికారిక సమాచారం అందినట్లు అఫ్ఘాన్ మీడియాలో కథనాలు ప్రసారం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇమ్రాన్ అంతానికి సైనికాధిపతి అసీమ్ మునీర్ నేతృత్వంలోని వర్గమే కారణమని కూడా ఆరోపణలు వెలువడ్డాయి.

Advertisement

ఇమ్రాన్ ఖాన్ మరణవార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం, సైనికాధికారులు స్పందిస్తూ అవి నిరాధారమైన తప్పుడు వార్తలని ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ప్రకటించారు. ఈ పుకార్లు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్‌ను తమకు చూపించాలంటూ ఆయన సోదరీమణులు, వేలాది మంది అభిమానులు, PTI మద్దతుదారులు జైలు వద్ద నిరసన చేపట్టారు. గత మూడు వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని ఇమ్రాన్ సోదరీమణులు సంచలన ఆరోపణ చేశారు. తమను అడ్డుకున్న పోలీసులు దాడి చేశారని, విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ తమను జుట్టు పట్టుకుని కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తనను జైలులో అంతం చేయాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మరణవార్తలపై సందేహాలు బలపడుతున్నాయి. అయితే పాకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని, పాక్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఇమ్రాన్ మరణవార్తను ప్రచారం చేస్తున్నారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ జీవించి ఉన్నారని అధికారులు ధ్రువీకరిస్తున్నప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకోవడం, సోదరీమణులపై దాడి జరగడం వంటి పరిణామాలు అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

Advertisement

ALSO READ: రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×