BigTV English
Advertisement

Amazon Electronics Festive Sale: మహాద్భుతం.. అమెజాన్ న్యూ సేల్ షురూ.. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, పాడ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు!

Amazon Electronics Festive Sale: మహాద్భుతం.. అమెజాన్ న్యూ సేల్ షురూ.. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, పాడ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు!

Amazon Electronics Festive Sale: ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు వీటికి వేదికలుగా మారుతున్నాయి. కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొత్త సేల్‌ తీసుకొచ్చి అతి తక్కువ ధరలోనే పలు ప్రొడక్టులను అందించి కస్టమర్లను తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. ఇక ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన సేల్‌ ప్రకటించింది. ఇక ఇప్పుడు అమెజాన్ వంతు వచ్చింది. తాజాగా అమెజాన్‌ ఇండియా తన స్పెషల్ సేల్ ‘అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివ్ సేల్‌’ (Amazon Electronics Festive Sale) ను ఇండియాలో తీసుకొచ్చింది.


ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ వంటి వంటి ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో OnePlus, Sony, Samsung వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్‌లు అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మరి ఈ సేల్‌లో ఏయే ప్రొడక్టులపై ఎంత తగ్గింపు ఇస్తున్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్‌లో ఈ-కామర్స్ సంస్థ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్‌లను తీసుకొచ్చింది.

ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనిలో వినియోగదారులు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, Amazon Pay ICICI బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్ల ద్వారా ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఇది కాకుండా, సేల్‌లో నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. Amazon బిజినెస్ కస్టమర్‌లు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా Amazon Prime ప్రయోజనాలు, GST ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందుతారు.


Also Read: బీభత్సం.. హానర్ ఏంటి భయ్యా ఒకేసారి ఇన్ని లాంచ్ చేసింది, ధర సహా పూర్తి వివరాలివే!

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివ్ సేల్‌లో అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపులు అందించబడుతున్నాయి. అందులో iQOO Z9s 5G ఫోన్ రూ.25,999 ఉండగా ఇప్పుడు ఈ సేల్‌లో రూ. 19,998కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై విపరీతమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. దీని కింద HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3000 తగ్గింపును పొందవచ్చు. దీంతో పాటు OnePlus Nord 4 5G ఫోన్ రూ. 29,998కి సేల్‌లో లిస్ట్ చేయబడింది. ఈ ఫోన్‌ను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

అలాగే OnePlus Nord CE4 Lite 5G ఫోన్ రూ. 19,998కి సేల్‌లో లిస్ట్ చేయబడింది. కంపెనీ ఈ ఫోన్‌పై విపరీతమైన బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. దీని కింద ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. iQOO Z9 Lite 5G ఫోన్ రూ. 10,498కి సేల్‌లో లిస్ట్ చేయబడింది. HDFC బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్‌ ద్వారా ఈ ఫోన్‌పై రూ. 500 తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా Dell G15-5530 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.78,490 వరకు సేల్ ధరతో కొనుగోలు చేయవచ్చు. Lenovo IdeaPad Slim 3ని రూ. 61,990కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ 8కిలోల వాషింగ్ మెషీన్‌ను రూ.36,990కి కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం అమెజాన్‌ను సందర్శించాల్సిందే.

Related News

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Mobile Battery: వంద శాతం వద్దు బ్రో.. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు!

Headphones under rs 5000: రూ. 5 వేల లోపు అదిరిపోయే హెడ్‌ ఫోన్స్.. వెంటనే కొనేయండి!

Earbuds Under Rs 1000: మంచి సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్.. రూ. 1000 లోపు క్రేజీ ఇయర్ బడ్స్!

Big Stories

×