BigTV English

Geethu Royal: మహేష్ బాబుపై బిగ్ బాస్ గీతు రాయల్ షాకింగ్ కామెంట్స్

Geethu Royal: మహేష్ బాబుపై బిగ్ బాస్ గీతు రాయల్ షాకింగ్ కామెంట్స్

Geethu Royal coments on Mahesh babu hair style: సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుని తర్వాత బిగ్ బాస్ 6 సీజన్ కంటెస్టెంట్ గా కనిపించి పేరు తెచ్చుకుంది గీతూ రాయల్. ఎక్కడైనా..ఎప్పుడైనా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పడం గీతూ కి అలవాటు. అదే యాటిట్యూడ్ ని బిగ్ బాస్ లోనూ చూపించింది. అయితే గీతూ లోని ధైర్య సాహసాలకు బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. నెల్లూరు స్లాంగ్ లో గీతూ మాట్లాడే భాష అద్భుతం. నాగార్జున కూడా గీతూ రాయల్ ని ఎంతగానో మెచ్చుకునేవారు. మొదట్లో బాగానే కంట్రోల్ లో ఉన్న గీతూ రాయల్ రానురానూ నోరును అదుపులో పెట్టుకోలేనంతగా బిహేవ్ చేసింది. దీనితో మెల్లిగా ఓటింగ్ శాతం కూడా తగ్గిపోవడం ప్రారంభమయింది. అందుకే బిగ్ బాస్ 6 సీజన్ లో కనీసం టాప్ 5 లోనూ స్థానం దక్కించుకోలేకపోయింది గీతూ రాయల్.


బిగ్ బాస్ లో ఏడ్చేసింది

కేవలం తొమ్మిది వారాలకే పరిమితం అయింది. అయితే చివరి రోజు గీతూ నాగార్జున ను తనని ఎలిమినేటర్ చెయ్యొద్దని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అప్పటిదాకా ఎంతో ధైర్యం ప్రదర్శించిన గీతూ చివరిక వచ్చేసరికి అలా ప్రవర్తించడం ప్రేక్షకులకు నచ్చలేదు. అయినా నిబంధనల ప్రకారం తప్పనిసరిగా వెళ్లిపోవాల్సి వచ్చంది. బయటకొచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. గత నెలలో ఓ పోస్టింగ్ పెట్టి తీవ్ర భావోద్వేగానికి గురయింది. తన కొడుకు మరణించాడని..ఆ మరణానికి కారకులు కూడా తనకు తెలుసని పోస్టింగ్ పెట్టింది. తీరా చూస్తే తాను కొడుకులా పెంచుకుంటున్న ఓ పిల్లికి సంబంధించిన పోస్టు అని తెలిసి ఆమె అబిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


వైరల్ గా మారిన కామెంట్స్

తాజాగా బిగ్ బాస్ గీతూ రాయల్ మరోసారి మహేష్ బాబుపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మహేష్ ఫ్యాన్స్ గీతూ పై మండిపడుతున్నారు. విషయం ఏమిటంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 అంటూ ప్రేకకుల ముందుకు వచ్చింది. చాలా వరకూ పెద్దగా గుర్తింపు లేని స్టార్స్ తోనే నెట్టుకొస్తున్నారు. మొదలవడమే గొడవలతో స్టార్ట్ అయింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బిగ్ బాస్ సీజన్ 8కి ఎంపికయ్యాడు నాగమణికంఠ. అయితే అందరిలాగానే నాగమణి కంఠ సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నాడు. తనని టార్గెట్ చేస్తూ అందరూ కలిసి నామినేషన్ల లకి నెట్టారు. దీనితో నాగమణి కంఠ బిగ్ బాస్ ఓట్ల కోసం సింపతీని పదే పదే క్రియేట్ చేసుకుంటున్నాడు. తన తల్లి, తండ్రి మరణించారని..తన భార్య తనని వదిలి వెళ్లిపోయిందని..తనకి అత్తా మామల సపో్టు కూడా లేదని తాను కేవలం తన పాప కోసమే బిగ్ బాస్ లోకి వచ్చానని అంటున్నాడు.

విగ్గుపై కామెంట్స్

ఒకానొక మూమెంట్ లో తీవ్ర ప్రస్టేషన్ లో ఉన్న నాగమణి కంఠ తన నెత్తిపైన ఉన్న విగ్గును తీసి చాలా ఎమోషన్ కు గురయ్యాడు. తన వద్ద హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు డబ్బులు లేకపోవడంతో విగ్గు పెట్టుకున్నానని చెప్పడంతో..ఇప్పుడు నెటిజన్లు అంతా నాగమణి కంఠను ట్రోలింగుు చేస్తున్నారు. ఇన్నాళ్లూ నీ జుట్టు ఒరిజినల్ అనుకున్నాము ఇప్పుడు అది విగ్గు అని తేలిందంటూ ఆటపట్టిస్తున్నారు. అయితే నాగమణి కంఠకు సపోర్టుగా నిలిచింది గీతూ రాయల్. నువ్వే మీ ఫీల్ కాకు మణి..సినిమా రంగంలో ఒకప్పుడు బడా స్టార్లంతా విగ్గులతో కనిపించినవారే. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా విగ్గు పెట్టుకుంటాడని.. కాబట్టి మణికంఠ ఫీలవ్వాల్సిన పనే లేదని చెప్పుకొచ్చారు. అయితే గీతూ తమ అభిమాన హీరోని టార్గెట్ చేసి మట్టాడటంతో మహేష్ అభిమానులు గీతూ రాయల్ పై విరుచుకుపడుతున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Geetu Royal (@geeturoyal_)

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×