BigTV English
Advertisement

Actor Vinayakan: జైలుకెళ్లిన జైలర్ నటుడు.. రియల్ లైఫ్ లోనూ విలనిజమే?

Actor Vinayakan: జైలుకెళ్లిన జైలర్ నటుడు.. రియల్ లైఫ్ లోనూ విలనిజమే?

Malayalam actor Vinayakan arrested at Hyderabad airport: జైలర్ మూవీలో ప్రధాన విలన్ గా నటించి మెప్పించారు వినాయకన్. నలుడుగానే కాదు డ్యాన్సర్ గా, సింగర్ గా మల్టీ ట్యాలెంటెడ్ నటుడిగా సినిమా రంగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. 1995లో వచ్చిన మలయాళ చిత్రం మాంత్రికంలో వినాయకన్ కేవలం అతిథి పాత్రలో మెప్పించాడు. ఆ మూవీతోనే సినీ రంగ ప్రవేశం చేశాడు.ఆ మూవీలో మోహన్ లాల్, రఘువరన్ వంటి దిగ్గజాలు నటించారు. నటించింది చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెల్లగా సమాయనటుడి పాత్రలు, హాస్య పాత్రలు చేస్తూ వచ్చాడు వినాయకన్. 2016 లో కమ్మటి పాడమ్ అనే మలయాళ మూవీలో గంగ గా నటించాడు వినాయకన్. ఆ మూవీలో ఉత్తమ నటన కనబరిచినందుకు గాను కేరళ రాష్ట్ర చలన చిత్ర రంగం తరపును ఉత్త మ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఆ మూవీలో ఓ పాటకు లిరిక్స్ కూడా తానే స్వయంగా సమకూర్చడం విశేషం.


జైలర్ లో వర్మగా..

టాప్ 25 మలయాళ మూవీలలో ఒకటైన ఈమా..యౌ అనే మూవీలోనూ నటించడంతో అతని పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ లో వినాయకన్ నటనకు ప్రేక్షకుడు ఫిదా అవ్వాల్సిందే. హీరోని కూడా డామినేట్ చేసే పాత్రలో వినాయకన్ మెప్పించాడు. ఒక పక్క క్రూరమైన విలన్ గా నటిస్తూనే జైలర్ మూవీలో రెండు మూడు డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తాడు. మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్ గా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేలా చేయడంతో జైలర్ పాత్ర వినాయకన్ కు డబుల్ ప్రమోషన్ తెచ్చిపెట్టింది. దానితో పలు సినిమా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి వినాయకన్ కు. అయితే వినాయకన్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ హైదరాబాద్ నుండి గోవా వెళుతుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. విషయం ఏమిటంటే వినాయకన్ మద్యం తాగిన మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. అయితే పోలీసులు తనని అకారణంగా ఏ తప్పూ చేయకపోయినా అరెస్టు చేయడంపై వినాయకన్ తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తాగిన మత్తులో దాడి

ఎయిర్ పోర్టులో తాగిన మత్తులో ఉన్న వినాయకన్ సీఐఎస్ఎఫ్ అడిగిన ప్రశ్నలకు తల బిరుసుగా సమాధానం ఇచ్చాడని..అదేమిటని అడిగిన సీఐఎస్ఎఫ్ అధికారిపై వినాయకన్ చెయ్యి కూడా చేసుకున్నాడని..ఆ నేరంపైనే అతనిని అదుపులోకి తీుకున్ామని అధికారులు చెబుతున్నారు. తనని అన్యాయంగా పోలీసులు కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లారని..కావాలంటే సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని..తప్పెవరు చేశారో తెలుస్తుందని అన్నారు వినాయకన్. గతంలోనూ వినాయకన్ పై ఇలాంటి దురుసు ప్రవర్తనపై పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. కాగా జైలర్ మూవీలో వర్మగా నటించి మంచి పేరు తెచ్చుకున్న వినాయకన్ ను నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేంటి వర్మా..జైలర్ లో నటించి జైలుపాలయ్యావా? అంటూ ట్రోలింగ్ చేస్తుంటే మరికొందరు వినాయక చవితి రోజున వినాయకన్ ను అరెస్ట్ చేయడంపై ట్రోలింగ్ చేస్తున్నారు.

Related News

Bidar Road Incident: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..

Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Konaseema District: రాష్ట్రంలో దారుణం.. ఐదవ తరగతి బాలిక ఆత్మహత్య

Hyderabad Crime: రెండేళ్ల కూతురితో కలిసి హుస్సేన్‌ సాగర్ లో దూకిన మహిళ.. కారణం ఇదే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసి బయటకు తోసేశారు.. చివరకు?

Karimnagar: ఉపాధ్యాయుడు కొట్టాడని గడ్డిమందు తాగిన ఇద్దరు విద్యార్థులు

Vikarabad Crime: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లో డ్రైవర్..?

Pet Dog Killed: కుక్క పిల్లను నేలకేసి కొట్టి చంపిన పని మనిషి.. లిఫ్ట్ లో జరిగిన దారుణం సీసీ కెమెరాల్లో రికార్డ్

Big Stories

×