Budget Smart Tv| అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. స్మార్ట్ టీవీలు ఇప్పుడు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఇది సరైన సమయం. రూ. 10,000 లోపు బడ్జెట్‌లో మంచి మోడల్స్ లభిస్తున్నాయి. చాలా టీవీలపై బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. రూ.10,000 బడ్జెట్‌లో బెస్ట్ మంచి స్మార్ట్ టీవీ ఆప్షన్లు చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ అయిన మార్క్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీలు ఇస్తుంది. ఈ 32 ఇంచ్ హెచ్‌డి రెడీ టీవీ సేల్‌లో రూ.7,999కు దొరుకుతోంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా చూడవచ్చు. 24W స్పీకర్లు మంచి సౌండ్ ఇస్తాయి. రెండు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు ఉన్నాయి. ఎలిజిబుల్ కార్డులతో 1,250 నుంచి 1,500 రూపాయలు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ సేల్‌లో అతి చౌక స్మార్ట్ టీవీలలో ఒకటి. ఈ 32 ఇంచ్ హెచ్‌డి రెడీ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ7,799కు లభిస్తోంది. HDFC కార్డు ఉపయోగిస్తే రూ.500 అదనపు డిస్కౌంట్. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 18W స్పీకర్లు క్లియర్ ఆడియో ఇస్తాయి. రెండు HDMI, ఒక USB పోర్ట్ ఉన్నాయి. ఒక సంవత్సరం వారంటీ వస్తుంది.
రియల్‌మీ ఫుల్ హెచ్‌డి స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరకు ఇస్తోంది. ఈ 32 ఇంచ్ మోడల్ సేల్‌లో రూ.9,200 దొరుకుతోంది. కార్డు డిస్కౌంట్‌తో 1,250 నుంచి 1,500 రూపాయలు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో 2,000 రూపాయల వరకు అదనపు సేవింగ్స్. 60Hz రిఫ్రెష్ రేట్, 24W స్పీకర్లు Dolby Audioతో ఉన్నాయి. 1GB RAM, 8GB స్టోరేజ్ ఉంది. మూడు HDMI, రెండు USB పోర్టులు. డిస్‌ప్లే ప్యానెల్‌కు రెండు సంవత్సరాల వారంటీ.
రియల్‌మీ టెక్‌లైఫ్ QLED స్మార్ట్ టీవీని రూ.9,499 ఇస్తోంది. ఇది HD Ready QLED టీవీ, గూగుల్ టీవీ ప్లాట్‌ఫాం ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, 26W స్పీకర్లు మంచి సౌండ్ ఇస్తాయి. 1GB RAM, 8GB స్టోరేజ్. మూడు HDMI, రెండు USB పోర్టులు. ఒక సంవత్సరం వారంటీ.
Also Read: ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక.. జీరో క్లిక్ స్పైవేర్ దాడులు చేస్తున్న సైబర్ దొంగలు
వన్‌ప్లస్ Y1 స్మార్ట్ టీవీ 9,989 రూపాయలకు అందుబాటులో ఉంది. కార్డు డిస్కౌంట్‌తో 1,250 నుంచి రూ.1,500 తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,000 వరకు సేవింగ్స్. 60Hz రిఫ్రెష్ రేట్, 20W స్పీకర్లు Dolby Digital Plusతో. 1GB RAM, 8GB స్టోరేజ్. రెండు HDMI, రెండు USB పోర్టులు. ఒక సంవత్సరం వారంటీ.
మోటోరోలా 32 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ 10,099 రూపాయలకు దొరుకుతోంది. ఎలిజిబుల్ కార్డులతో రూ.1,250 నుంచి రూ.1,500 డిస్కౌంట్. 60Hz రిఫ్రెష్ రేట్, 40W పవర్‌ఫుల్ స్పీకర్లు. 1GB RAM, 8GB స్టోరేజ్. మూడు HDMI, రెండు USB పోర్టులు. ఒక సంవత్సరం వారంటీ.