truke AuraPro TWS earbuds: ప్రస్తుత టెక్ యుగంలో.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీస్‌లో పని చేస్తున్నా.. అంత కాకుండా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నా, లేదా ప్రయాణాలు చేస్తున్నా.. ఇయర్ బడ్స్ మన లైఫ్‌లో ఒక భాగమైపోయాయి. తక్కువ ధరలో.. ప్రీమియం ఫీచర్లు అందించే.. గాడ్జెట్స్ కోసం చూస్తున్న యూజర్ల కోసం.. ప్రముఖ ఆడియో బ్రాండ్ ట్రూక్ మార్కెట్లోకి తీసుకువచ్చిన అద్భుతమైన డివైస్ ఈ మోడల్. అత్యంత ఆకర్షణీయమైన .. లెదర్ ఫినిషింగ్‌తో కేవలం రూ.799 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్ ప్రస్తుతం మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ సూపర్ డూపర్ ఇయర్‌బడ్స్ అందించే.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఏంటో.. ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం.
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ అట్రాక్షన్ వీటి డిజైన్. సాధారణ ప్లాస్టిక్ కేస్‌లకు.. భిన్నంగా ఇది చాలా ప్రీమియం అయిన లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. ముఖ్యంగా సియన్నా బ్రౌన్ కలర్ వేరియంట్.. ఈ ఇయర్ బడ్స్‌కు రాయల్ లుక్‌ను.. ఇస్తుంది. చేతిలో.. పట్టుకోవడానికి చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా.. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఫ్యాషన్ లవర్స్ , ట్రెండీ గాడ్జెట్స్ ఇష్టపడే వారికి ఈ డిజైన్ కచ్చితంగా నచ్చుతుంది.
చిన్న ఇయర్ బడ్స్ అయినా.. వీటి బ్యాటరీ బ్యాకప్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 60 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్ లేదా కాలింగ్ ఫీల్ ఇది అందిస్తుంది. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. తరచూ ప్రయాణాలు చేసేవారికి, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండే.. వారికి ఈ బ్యాటరీ లైఫ్ నిజంగా ఒక గొప్ప ఆప్షన్ లాంటిది.
సౌండ్ లవర్స్ కోసం ఇందులో.. పవర్‌ఫుల్ 13ఎంఎం డ్రైవర్లు అమర్చారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు క్లియర్ అయిన వోకల్స్, డీప్ బేస్, రిచ్ ఆడియో ఫీల్ కలుగుతుంది. బడ్జెట్ రేంజ్‌లో.. ఇంత చక్కటి సౌండ్ క్వాలిటీ.. అందించడం విశేషం. మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు థియేటర్ రేంజ్ ఫీలింగ్ ఇస్తుంది.
Also Read: తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!
ఈ హెడ్‌సెట్‌లో.. లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీని అందించారు. దీని వల్ల కనెక్షన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అంతే కాకుండా సిగ్నల్ లాస్ అనే సమస్యే ఉండదు. అలాగే.. ఇందులో ఉన్న డ్యూయల్ పేరింగ్ ఫీచర్ ద్వారా ..ఏకకాలంలో రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ మీటింగ్స్.. అటెండ్ అవుతూనే మొబైల్ కాల్స్‌ను హ్యాండిల్ చేయడం.. దీని ద్వారా చాలా ఈజీ అవుతుంది.
ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, ప్రీమియం లెదర్ లుక్, 60 గంటల బ్యాటరీ బ్యాకప్.. కలిగిన ఈ మోడల్ ఇయర్ బడ్స్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుత ఆఫర్ల ప్రకారం దీని ధర కేవలం రూ.799 మాత్రమే ఉంది! బడ్జెట్ ధరలో బెస్ట్ ఆడియో గేర్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అదిరి పోయే సౌండ్ క్వాలిటీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర అన్నీ ఒకే చోట కావాలనుకునే.. వారికి ఈ మోడల్ఇయర్‌బడ్స్ ఒక నంబర్ వన్ ఆప్షన్. తక్కువ ఖర్చులో.. ప్రీమియం ఫీలింగ్ పొందాలనుకుంటే.. ఈ ఇయర్‌బడ్స్‌ను ధైర్యంగా ఎంచుకోవచ్చు.