Harry Brook spat Chewing Gum: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రావల్పిండి వేదికగా నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక దుమ్ము లేపింది. ఇంగ్లాండ్ విధించిన 429 పరుగుల లక్ష్యాన్ని కూడా చేదించి సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన వీరుడు హ్యారీ బ్రూక్ చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది.
శ్రీలంక గెలిచిన వెంటనే తీవ్ర అసహనానికి గురైన హ్యారీ బ్రూక్…ప్రత్యర్థి ప్లేయర్లను చూస్తూ ఉమ్మేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఓటమిని తట్టుకోలేక నోట్లో ఉన్న చూయింగ్ గమ్ ను ఉమ్మేసాడని అంటున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో లంక క్రికెటర్లను అవమానించేందుకు హ్యారీ బ్రూక్ ఇలా చేశాడని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. డబుల్ సెంచరీ చేసినా, ఇంగ్లాండ్ ను ఓడించారనే కోపంతో ఇలా చేశాడని, ఇలాంటి వాడిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 429 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని శ్రీలంక పోరాడి మరి గెలిచింది. 49.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ విధించిన టార్గెట్ ను చేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ దెబ్బకు హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ వృధా అయిపోయింది.
శ్రీలంక చేతిలో మ్యాచ్ ఓడిపోయిన క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు శ్రీలంక ప్లేయర్లు సంబరాలు చేసుకుంటున్న క్రమంలో తన నోట్లో ఉన్న చూయింగ్ గమ్ ఉమ్మేశాడు. అయితే, శ్రీలంక ప్లేయర్లను చూస్తూనే బ్రూక్ ఉమ్మేసినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో వెంటనే అతడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ క్రికెటర్లకు ఒళ్లంతా పొగరే అంటూ సీరియస్ అవుతున్నారు. అయితే మరికొంతమంది హ్యారీ బ్రూక్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని కౌంటర్ ఇస్తున్నారు. నోట్లో ఉన్న చూయింగ్ గమ్ నేలపై ఉమ్మేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. లంక ప్లేయర్లను కించపరిచే విధంగా హ్యారీ బ్రూక్ ఎక్కడ వ్యవహరించలేదని తెలుపుతున్నారు.