Amazon Great Republic Day Sale: ప్రస్తుతం టెక్ ప్రియులందరి దృష్టి అమెజాన్ మీదనే ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ఇప్పటికే ప్రారంభమై సందడి చేస్తోంది. జనవరి 16 నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్.. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసు పనుల కోసం కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం. ప్రముఖ బ్రాండ్లు తమ గ్యాడ్జెట్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. మీరు రూ.40వేల బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ఈ సేల్‌లో లభించే టాప్ డీల్స్ ఏవో ఒకసారి పరిశీలిద్దాం.
ఈ సేల్‌లో HP, Dell, Lenovo, Acer వంటి దిగ్గజ బ్రాండ్లు అందుబాటు ధరలోకి వచ్చాయి. ఇవన్నీ ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్ వర్క్స్, ఆఫీస్ మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. అతి తక్కువ ధరలో కావాలనుకునే వారు Asus Vivobook Go 14లను ఓసారి పరిశీలింవచ్చు. దీని ధర కేవలం రూ.30,990 మాత్రమే. తేలికగా ఉండి.. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా భారత మార్కెట్లోకి ‘మోటరోలా సిగ్నేచర్’ వచ్చేస్తోంది!
అలాగే బడ్జెట్ తక్కువగా ఉండి.. మెరుగైన పనితీరు అందించే స్టూడెంట్స్ కోసం Acer Aspire Lite రూ.35,990కే లభిస్తోంది. ఇక పవర్‌ఫుల్ 13వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో వచ్చే HP 15 మోడల్ రూ.37,990కి దొరుకుతోంది. స్టైలిష్ లుక్ కోసం Lenovo IdeaPad Slim 3 రూ.38,490, మంచి పర్ఫార్మెన్స్ కోసం Lenovo V15 రూ.38,999 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ బిల్డ్ కావాలనుకునే వారి కోసం Dell 15 మోడల్ రూ.39,990కి లభిస్తోంది.
రూ.40 వేల లోపు ధర ఉన్నప్పటికీ.. వీటిలో ఫీచర్ల విషయంలో కంపెనీలు ఎక్కడా తగ్గలేదు. సాధారణంగా ఈ ధర రేంజ్‌లో మీకు Intel Core i3 లేదా Ryzen 3 ప్రాసెసర్లు, 8GB నుంచి 16GB వరకు RAM, వేగవంతమైన పనితీరు కోసం 512GB SSD స్టోరేజ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ రోజువారీ బ్రౌజింగ్, ఆఫీస్ డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ క్లాసెస్‌కు బెస్ట్ ఆఫ్సన్.
ఈ సేల్‌లో కేవలం డిస్కౌంట్‌లే కాకుండా.. మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా.. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరికొంత తగ్గింపు పొందే వీలుంది. జేబుపై భారం పడకుండా నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే బెస్ట్ ట్యాప్‌టాప్స్ కావాలంటే.. ఇంత కంటే మంచి అవకాశం ఉండదు.
Also Read: 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo భారత్‌లో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి!